తమిళ బుల్లితెర నటి వి.జె. చిత్ర మరణం అనేక ప్రశ్నలను మిగిల్చింది. ఆమె అభిమానులకు మాత్రం ఆమె మరణం పెద్ద షాకే. ఆ రాత్రి తనకు కాబోయే భర్త హేమంత్ కూ, ఆమెకూ మధ్య జరిగిన మాటల యుద్ధం తెలిస్తే ఈ కేసులో చిక్కుముడి విడిపోతుంది. ఈ విషయంలో హేమంత్ నిజం చెబుతున్న దాఖలాలు కనిపించడం లేదు. హోటల్ సిబ్బందితో కలిసి ఆయన నాటకమాడుతున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె మరణించిన సమయంలో తాను గది వెలుపల ఉన్నానంటున్నాడు హేమంత్. ఆమె బుధవారం తెల్లవారు జామున మరణించింది. మంగళవారం ఆమె షూటింగులో పాల్గొని వచ్చింది.


హేమంత్ కథనం ప్రకారం..
చిత్ర, హేమంత్ ల నిశ్చితార్థం ఈ ఏడాది ఆగస్టులో జరిగింది. ఆ తర్వాత వీరిద్దరూ సీక్రెట్ గా అక్టోబరు 19న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారట. ఈ పెళ్లి విషయాన్ని మాత్రం ఇద్దరూ రహస్యంగా ఉంచారు. ఈ విషయాన్ని ఎవరూ బయటపెట్టలేదు. కాకపోతే ఆమె తన సోషల్ మీడియాలో మాత్రం త్వరలో తన పెళ్లి జరగబోతున్నట్టు మాత్రం పేర్కొంది. ఈ పెళ్లికి అవసరమైన పత్రాలను తన భర్త రిజిస్టర్ ఆఫీసుకు సమర్పించారని పేర్కొంది. తమకు రిజిస్టర్ మ్యారేజ్ జరిగిన విషయాన్ని వీరు ఎందుకు రహస్యంగా ఉంచారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. చాలా కాలంగా హోటల్ గదిలోనే ఉంటున్నారంటే వీరి పెళ్లికి కొన్ని ఆటంకాలు ఉన్నట్లుగానే భావించాల్సి వస్తోంది. చిత్ర తండ్రి ఓ పోలీస్ అధికారి అని చెబుతున్నారు. ఒకసారి పెళ్లి చేసుకుని మళ్లీ జనవరిలో ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారన్నది కూడా పెద్ద ప్రశ్నే.
Must Read ;- `బ్యాక్ డోర్` ఎంట్రీతో ఆమె జీవితంలో ఏం జరిగింది?
మంగళవారం ఏం జరిగింది?
మంగళవారం ఆమె రోజంతా బిజీ బిజీగా గడిపింది. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో ఓ షూటింగులో పాల్గొన్నట్టు సమాచారం. తెల్లవారు జామున ఒంటిగంటకు హోటల్ గదికి వచ్చిందట. ఆమె ఆలస్యంగా రావడానికి కారణం షూటింగా? లేదా ఇంకేమైనా కారణం ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆమె ఆలస్యంగా వచ్చినందుకు హేమంత్ మందలించాడా అనేది ఇంకో ప్రశ్న. గదికి వచ్చిన సమయంలో ఆమె మానసిక ఆందోళనతో కనిపించిందని హేమంత్ అంటున్నాడు. ఆ తర్వాత ఆమె స్నానానికి వెళ్లింది. లోపలి నుంచి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో హోటల్ సిబ్బంది సాయంతో మరో తాళంతో బాత్ రూమ్ డోర్ తెరిచామని హేమంత్ అంటున్నారు. అసలు బాత్ రూమ్ కు తాళం ఎందుకు ఉంటుందన్నది ఇంకో ప్రశ్న. సాధారణంగా ఇలాంటి కేసుల్లో తలుపులు పగులగొట్టి లోపలికి వెళుతుంటారు.
బుధవారం తెల్లవారు జామున ఏం జరిగింది?
ఆమె హోటల్ గదికి రాగానే స్నానానికి వెళ్లి ఎంతసేపటికీ తిరిగిరాలేదు. పిలిచినా పలకకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ సిబ్బందిని పిలిచానని హేమంత్ అంటున్నారు. చీరతో ఉరి వేసుకుని కనిపించిందని అతను అంటున్నాడు.హోటల్ నుండి తెల్లవారుజామున 3.30 గంటలకు అత్యవసర నంబర్ 100 కు కాల్ వచ్చింది. తన కుమార్తె మరణంపై సరైన దర్యాప్తు చేయాలని రిటైర్డ్ పోలీసు అయిన ఆమె తండ్రి నజరత్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
చిత్ర మరణంపై తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రస్తుతం పోలీసులు హేమంత్నీ, అతనికి సహాయం చేసిన హోటల్ ఉద్యోగినీ విచారిస్తున్నారు. వీరిద్దరూ ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. జనవరిలో వివాహం చేసుకోవాల్సి ఉంది. ఎవరో చంపడంవల్లే చిత్ర చనిపోయిందని అందరూ అంటున్నారు. కేసు దర్యాప్తులోనే ఉంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులాగా చిత్ర కేసు కూడా అనేక అనుమానాలను మిగిల్చింది.
Also Read ;- ఆసిఫ్ బస్రా మరణంతో ఉలిక్కిపడిన బాలీవుడ్?