టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా తను నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా తో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది రాశి. ఇప్పటివరకు ఆమె చిన్న హీరోల సరసన మాత్రమే హీరోయిన్ గా నటించింది. ఆ మధ్యకాలంలో స్టార్ హీరో ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’ వంటి సినిమా చేసిన ఈ అమ్మడుకి మాత్రం పెద్ద హీరోల నుండి ఎలాంటి ఆఫర్స్ రాలేదు. యావరేజ్ హీరోలతో కాలం వెళ్లదీస్తున్న రాశికి తమిళ్ లో బిగ్ ఛాన్స్ వచ్చిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ – టాలెంటెడ్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో బడా యాక్షన్ సినిమా ఒకటి తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖాన్నాను ఫైనల్ చేశారని సమాచారం. ఇప్పటికే దర్శకుడు హరి, రాశిని కలిసి కథను వినిపించాడట. అందులోని పాత్ర నచ్చడంతో రాశీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోతో పాటు హీరోయిన్ కు కూడా యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్ర అని టాక్. ఎప్పటి నుండో నటనకు ప్రాదాన్యం ఉన్న పాత్ర చేయాలని చూస్తున్న రాశికి దర్శకుడు హరి రూపంలో మంచి కథ దొరికిందనే చెప్పాలి. ఆల్రెడీ రాశి ఖన్నా తమిళంలో విశాల్, విజయ్ సేతుపతి, జయం రవి వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయ్యాయి.
అలాగే విక్రమ్ తో నటించబోయే సినిమా కూడా తన సినీ జీవితానికి ఉపయోగపడుతుందని ఆమె భావిస్తోంది. ఇప్పటికే విక్రమ్ – హరి కాంబినేషన్ లో వచ్చిన ‘సామి’, ‘సామి2’ లాంటి సినిమాలు తమిళ్ లో భారీ విజయాలు సాధించాయి. దాంతో వీరిద్దరి కలయికలో రాబోతున్న కొత్త చిత్రంపై కూడా కోలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారని సమాచారం.










