పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వారసుడు అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ఈమధ్య ఆ వార్తలు కాస్త ఎక్కువుగానే వస్తున్నాయి. దీంతో అకిరా ఎంట్రీ పై అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ పెరిగిందని చెప్పచ్చు. రేణుదేశాయ్ తెరకెక్కించిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో అకిరా బాలనటుడుగా కనిపించాడు. ఈవిధంగా అకిరాకి సినిమాల్లో నటించాలని ఇంట్రస్ట్ ఉందనే విషయం చెప్పకనే చెప్పారు. ఇటీవల అకిరా బాధ్యతను బాబాయ్ పవన్ కళ్యాణ్.. అబ్బాయ్ రామ్ చరణ్ చేతిలో పెట్టాడని.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ లో టాక్ వినిపించింది.
Alson Read ;- కాబోయే జంట నిహారిక, చైతన్య డ్యాన్స్; సోషల్ మీడియాలో వైరల్.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్లికి కొడుకు అకిరా కూతురు ఆద్యలతో కలిసి వెళ్లారు. నిహారిక పెళ్లిలో అకిరాను చూసిన వాళ్లందరిలో ఒకటే ప్రశ్న.. అకిరా హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని. అయితే.. తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. అది ఏంటంటే.. పవన్ కళ్యాణ్ అకిరాను హీరోగా పరిచయం చేసే బాధ్యతను ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ చేతిలో పెట్టారట. ఇంతకీ.. ఆ ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ ఎవరంటే.. ఒకరు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కాగా మరొక టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ప్రస్తుతం పవన్ దిల్ రాజు బ్యానర్ లోనే వకీల్ సాబ్ మూవీ చేస్తున్నారు.
పవన్.. మేనల్లుడు సాయిధరమ్ తేజ్ బాధ్యతను దిల్ రాజుకు అప్పగించారు. అందుకనే సాయిధరమ్ తేజ్ తో దిల్ రాజు వరుసగా సినిమాలు చేసారు. దిల్ రాజు తేజ్ తో నిర్మించిన సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలు సక్సస్ అయ్యాయి. తేజ్ ని హీరోగా నిలబెట్టాయి. అందుచేత తనయుడు అకిరా బాధ్యతను కూడా దిల్ రాజుకు అప్పగించే ఛాన్స్ ఉంది అంటున్నారు. అల్లు అరవింద్, దిల్ రాజు.. ఈ ఇద్దరూ అకిరాకు సరిపడా కథ రెడీ చేయించే పనుల్లో బిజీగా ఉన్నారట. అయితే.. అకిరా వయసుకు తగ్గట్టుగా మంచి స్ర్కిప్ట్, డైరెక్టర్ ను అల్లు అరవింద్, దిల్ రాజు ఈ ఇద్దరిలో ఎవరు తేస్తే వాళ్ల చేతిలో అకిరాను పెట్టాలి అనుకుంటన్నారట పవన్. మరి.. అకిరాను పరిచయం చేసే లక్కీ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
Must Read ;- ఇన్ స్టాలో గ్రాముల కొద్దీ ‘రేణు’ గానామృతం