ఎఫ్ 2 ఇచ్చిన విజయోత్సాహంతో సీక్వెల్ ఎఫ్ 3 సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది. విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుంది. రేపు అనగా డిసెంబర్ 17న ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారని సమాచారం. ఇక రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 23 నుంచి ప్రారంభించనున్నారు. ఎఫ్ 3 సినిమా స్టార్ట్ చేయేనున్నారని తెలిసినప్పటి నుంచి ఇందులో మూడవ హీరో క్యారెక్టర్ ఉందని.. ఆ క్యారెక్టర్ కోసం మాస్ మహారాజా రవితేజని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి.
రవితేజతో అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ అనే సినిమా చేసారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సస్ అవ్వడంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుచేత అనిల్ రావిపూడి అడిగితే రవితేజ నో చెప్పడు. కనుక ఖచ్చితంగా ఎఫ్ 3లో రవితేజ నటిస్తారనుకున్నారు కానీ.. ఏమైందో ఏమో కానీ.. రవితేజ ఇందులో నటించడానికి నో చెప్పాడు. ఆతర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు తెర పైకి వచ్చింది. అవును.. ఎఫ్ 3లో మహేష్ నటించనున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపించింది. ఇది పుకారేమో అనుకున్నారు కానీ.. నిజంగానే దిల్ రాజు మహేష్ కి ఎఫ్ 3 కాన్సెప్ట్ గురించి చెప్పారట.
అయితే.. మహేష్ ఎఫ్ 3లో నటించేందుకు సున్నితంగా తిరస్కరించారట. ఆతర్వాత మళ్లీ ఎఫ్ 3 లో మూడవ హీరో గురించి ఎలాంటి వార్తలు రాలేదు. ఇప్పుడు ఎఫ్ 3 సెట్స్ పైకి వెళుతుండడంతో మరోసారి రవితేజ వార్తల్లో నిలచాడు. అయితే.. రవితేజ ప్లేస్ లోనే కమెడియన్ టర్నడ్ కథానాయకుడు సునీల్ ని తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఎఫ్ 3 లో ఎఫ్ 2 కు మించిన ఎంటర్ టైన్మెంట్ ఇందులో ఉంటుంది అంటున్నారు. అలాగే గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుందని.. ఆల్ ఆడియన్స్ కి నచ్చేలా ఈ సినిమా ఉంటుందని తెలిసింది. మరి.. ఎఫ్ 3 అంచనాలను ఎంత వరకు అందుకుంటుందో చూడాలి.
Must Read ;- ‘ఎఫ్ 3’లో ఐదుగురు హీరోయిన్లు.. ఎవరా ముద్దుగుమ్మలు?