తెలుగు తెరపై స్టార్ హీరోయిన్స్ గా సమంత .. కాజల్ .. తమన్నా ఒక వెలుగు వెలుగుతున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను అగ్రకథానాయకుల జోడీగా అనేక విజయాలను తమ ఖాతాలో వేసుకున్న ఘనత వీరి సొంతం. అందం .. అంతకుమించిన అభినయంతో ఈ ముగ్గురూ ఇట్టే ఆకట్టుకుంటారు. నటనపరమైన ప్రతిభ విషయంలోనే కాదు, నాజూకుతనాన్ని కాపాడుకునే విషయంలోను ఈ ముగ్గురూ పోటీపడుతుండటం విశేషం. చాలాకాలం క్రితమే ఈ ముగ్గురూ తమ కెరియర్ ను ఆరంభించినప్పటికీ, ఇప్పటికీ ‘సైజ్ జీరో‘ గానే కనిపిస్తున్నారు .. తమ జోరును కొనసాగిస్తూనే ఉన్నారు.

తేనె చినుకుల్లా .. పంచదార పలుకుల్లా కనిపించే ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు, ఎప్పటికప్పుడు బాడీ షేప్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. మరింత ఫిట్ నెస్ గా కనిపించడం కోసం కృషి చేస్తూనే ఉన్నారు. నల్లపూసలా కనిపించే వెన్నపూసలాంటి నడుము అందం కోసం ఓ చిన్నపాటి యజ్ఞమే చేస్తున్నారు. కథానాయికలు ఓ ఐదేళ్ల కంటే ఎక్కువగా ఈ గ్లామర్ ఫీల్డ్ లో కొనసాగలేరనే చాలామంది అభిప్రాయాలకు తమ కసరత్తులతోనే ఈ ముగ్గురూ ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎప్పుడు చూసినా సమంత సన్నజాజిలా కనిపించడానికీ .. కాజల్ తాజా గులాబీలా కనువిందు చేయడానికి .. తమన్నా మల్లెమొగ్గలా నిగనిగలాడటానికి కారణం వాళ్ల ఫిట్ నెస్ అనే చెప్పుకోవాలి .. ఆ విషయంలో వాళ్ల అంకితభావాన్ని ఒప్పుకోవాలి.
Must Read ;- లేటెస్ట్ ఫోటోస్ తో మెస్మరైజ్ చేస్తోన్న అందాల సమంత

సాధారణంగా జిమ్ .. యోగా .. స్విమ్మింగ్ తదితర విషయాల్లో చాలామంది బద్ధకం చూపుతుంటారు. రేపు చూద్దాంలే అని వాయిదా వేయడం జరుగుతుంటుంది. కానీ ఈ ముగ్గురు భామల విషయంలో అలాంటి వాయిదాల పద్ధతి కనిపించదు. ఆసనాలను శాసనాలుగా అమలుపరుస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ వస్తున్నారు. గ్లామర్ పరంగా తమ కొలతల్లో ఎక్కడా తేడా రాకుండా శ్రద్ధపెడుతూ కెరియర్ గ్రాఫ్ పడిపోకుండా చూసుకుంటున్నారు.

కథానాయికల గ్లామర్ లో ప్రధానమైన పాత్ర వహించే నడుము అందం విషయంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. సన్నాని నడుముతో సన్నాయిని తలపిస్తూ .. పున్నాగపూలను ఓడిస్తూ వెళుతున్నారు. బాడీ షేప్ విషయంలో వాళ్లు తీసుకుంటున్న ఈ జాగ్రత్తల కారణంగానే, మోడ్రన్ డ్రెస్ లు ధరించినా, సంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించినా అద్దినట్టుగా ఉంటుంది. అభిమానుల హృదయాలకి హత్తుకునేట్టుగా ఉంటుంది. అందుకే ఈ ముగ్గురూ నాయికలు నాజూకు అందానికి ఆనవాళ్లు! వాళ్లు చేసే కసరత్తులే ఇతర కథానాయికలకు సవాళ్లు!!
Also Read ;- ‘x’ పోజింగులో ‘మోస్ట్ ఎలిజిబుల్’ పూజ