రీవర్స్ పీఆర్సీ అమలు .. జీతాల్లో భారీ కోతలు..!
జగన్ రెడ్డి పాలనలో ప్రజలతో పాటు ఉద్యోగులు దగా పడ్డరన్నది అక్షర సత్యం! ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు!! ప్రజలకు సంక్షేమం రూపంలో నగదు కుమ్మరిస్తే చాలు అనుకున్నాడు జగన్. కానీ వారిపై మోపే ధరాఘాతాలను గుర్తించర్లే అని అనుకున్నాడు. నమ్మి గెలిపించిన ఉద్యోగులను నట్టేట్లో ముంచాడు. పీఆర్సీ అడిగితే.. హెచ్ఆర్ఏలో కోత విధించాడు. ‘రీవర్స్’ పీఆర్సీ ద్వారా ఉద్యోగుల జీతాల్లో భారీ కోత విధించాడు. ఒక్కో ఉద్యోగికి 20 శాతం వరకు కోత విధించి, రూల్స్ ప్రకారం ప్రభుత్వం అందించాల్సి ఫలాలను తుంగలో తొక్కారు. సచివాలయం ఉద్యోగుల నుంచి గ్రామ స్థాయి ఉద్యోగి వరకూ అందరికీ వేతనాలను భారీగా కోతలు విధించారు. హెచ్ఆర్ఏకు కటింగ్ తోపాటు సీసీఏ ను ఎత్తివేశారు. క్వాంటమ్ పెన్షన్ శ్లాబుల్లో మార్పు చేశారు. పెండింగ్ డీఏలను ఐఆర్ లో సర్ధుబాటు చేసి ఇకపై రాష్ట్ర స్థాయిలో పీఆర్సీలు ఉండవని, పదేళ్లకోసారి కేంద్రం వేసే కమిషన్ల ఆధారంగా పీఆర్సీ ఉంటుందని కొత్త విధానాన్ని అందుకున్నారు. చివరికి ఉద్యోగుల జీవితాలు కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయే పరిస్థతి దాపురించింది! చట్టబద్ధంగా ఏర్పడిన అశుతోశ్ మిశ్రా కమిషన్ సూచనలను కాదని.. జగన్ రెడ్డి నియమించిన ‘సీఎస్ కమిటీ’ సిఫార్సులకే జై కొట్టి, ఉద్యోగుల జీవితాలను అంధకారంలో నెట్టారు. ఫిట్మెంట్ విషయంలో దెబ్బకొట్టిన జగన్.. ఇంటి అద్దె భత్యం( హెచ్ఆర్ఏ ) కు కూడా భారీ కోత విధించాడు. రాష్ట్ర సచివాలయంలో పనిచేసే హెచ్ఓడీలకు 30 శాతం ఉన్న హెచ్ఆర్ఏ 14శాతం కోత విధించగా.. విజయవాడ, విశాఖ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల ఉద్యోగులకు 20 శాతం ఉన్న హెచ్ఆర్ఏ 4 శాతం, ఇతర పట్టణాల్లో ఉండే ఉద్యోగులకు 14 శాతం ఉన్న హెచ్ఆర్ఏ 6.5 శాతం, గ్రామీణ ప్రాంతాలు 12 శాతం ఉన్న హెచ్ఆర్ఏ 4 శాతం కోత విధిస్తూ.. అప్రజస్వామికంగా రాత్రికిరాత్రే జీవోలను విడుదల చేసి.. తాను అనుకున్నదే చేశాడు జగన్ రెడ్డి. దీనిపై ఉద్యోగుల సంఘాలు భగ్గుమంటున్నాయి.
సీసీఏ ఎత్తివేత.. విశ్రాంతి ఉద్యోగులకు సైతం తప్పని కోతలు..!
జగన్ రెడ్డి విడుదల చేసిన పీఆర్సీ జీవోలతో ఉద్యోగులకే కాదు.. రిటైర్డ్ సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడనున్నది. వేతన సవరణ జీవోలు సోమవారం అర్థరాత్రి విడుదలయ్యాయి. ఇప్పటికే ఐఆర్ 27 శాతం కంటే తక్కువ ఫిట్మెంట్ ( 23.29 ) ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు హెచ్ఆర్ఏ, డీఏల్లోనూ కోత విధిస్తూ.. ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ (సీసీఏ) ను ఎత్తివేశారు. 2018 జూలై ఒకటో తేదీ నాటికి పెండింగ్ లో ఉన్న 30.39 శాతం డీఏలను కలిపి స్కేల్స్ ను సవరించింది. పేరుకు 23 శాతం ఫిట్మెంట్ అయినప్పటికీ .. పే స్కేల్ లో దక్కేది 19శాతం ఫిట్మెంట్ మాత్రమే. అలానే విశాంత్రి ఉద్యోగుల 70 ఏళ్లు దాటితే 10 శాతం, 75-80 మధ్య 15 శాతం పెన్షన్ లో కోతలు విధించింది. మొత్తంగా ‘రివర్స్’ పీఆర్సీ జీవోల ద్వారా ప్రభుత్వం కోత అనే తాడుతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పీకకు ఉరి బిగించిందనే చెప్పాలి!