సీదిరి చీటి చినిగిపోయే రోజొచ్చింది .. !
సీదిరి అప్పలరాజు ఏపీ మంత్రి వర్యులు. అమర్యాదకు, అభ్యతకు నిలువెత్తు నాయకుడంటారు అందరూ. ప్రస్తుతం ఉత్తాంధ్రలో మంత్రిగారి స్పీడ్ పెరిగింది. అది చేతల్లోనూ .. మాటల్లోనూ ఈ మధ్య బాగానే కనిపిస్తోంది. అర్థరహిత, వివాదస్పద కామెంట్స్ చేస్తూ .. ముఖ్యమంత్రి దృష్టిలో పడాలనే ఈయనగారి తాపత్రయం ఒక్కొక్కసారి బెడిసిగొట్టి అబాసు పాలౌతుంటుంది. అధికారంలోకి వచ్చాం .. దేవుడు దయతో మంత్రి పదవీ కూడా వచ్చిందన్న సంతృప్తిని ఈయనగారిలో మచ్చుకైనా కనిపించవు. ఈ రెండింటిని వినియోగించుకుని నమ్మి ఓట్లేసిన ఓటర్లకు, నియోజకవర్గానికి బాసటగా నిలవాలన్న ఇంగితాన్ని మరిచి .. వివాదాలు కొనితెచ్చుకుంటారన్న విమర్శలు రచ్చ కీడుస్తున్నాయి.
వీఆర్వోలపై ఎందుకంత కక్ష్య ..?
మొన్న ఈ మధ్యనే శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి రెవిన్యూ ఉద్యోగులపై నోరు జారాడు. అంతటితో ఆగకుండా వారిని చీదరించుకుని అవమాన పరిచాడు. దీంతో ఉద్యోగ సంఘాలు ఆగ్రహించాయి. కట్ చేస్తే.. సీదిరిని సీటు నుంచి దించేవరకు వదిలేలా లేరు అవమానానికి గురైన ఉద్యోగులు. సమావేశానికి ఆహ్వానించి అవమానించడం ఏమిటని ప్రశ్నించిన వీఆర్వోలను రాజకీయాలు చెయ్యొద్దు .. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని మండిపడ్డారు మంత్రి గారు. అంతటితో ఆగకుండా ఆయన అధికార కావరాన్ని, దర్పాన్ని ప్రదర్శించి .. సినిమా డైలాగ్స్ పేల్చాడు. వీఆర్వోలు గ్రామ సచివాలయాల్లోకి అడుగు పెడితే.. తరిమి తరిమి కొట్టండి అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. డాక్టర్ అని పిలిపించుకునే ఈ మంత్రిగారు ఒక్కసారి ఫ్యాక్షనిస్టు మాదిరిగా మారిపోయి ఊగిపోయాడు. చివరికి మంత్రి క్షమాపణలు చెప్పే వరకు వదిలేది లేదంటూ రెవిన్యూ సంఘాలు భీష్మించాయి. ఎక్కడో ఏపీకి చివరినున్న పలాసలో మంత్రి సీదిరి కూసిన కూత నేడు ఏపీలోని అన్ని జిల్లాలను పాకి .. రాష్ట్రమంతా చుట్టుకుంది. మంత్రి వాఖ్యలను ఆగ్రహించిన రెవిన్యూ సంఘాలు మంత్రి దిగిరావాలని పట్టుపట్టాయి. ఏపీ రెవిన్యూ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నెల 6న ధర్నాలు చేపడుతున్నట్లు ఏపీ విఆర్వో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రరాజు పిలుపునిచ్చాడు. ఇంకా మంత్రి మంకుపట్టు విడవకుంటే 9న కలెక్టరేట్ల ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. అది మేటర్!! మంత్రిగారి నోటి దురుసుకు అధికారులిచ్చే సమాధానం అన్నట్లు సోషల్ మీడియా మంత్రి గారిపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాక జగన్ రెడ్డి పాలనల్లో అధికారుల పట్ల పొలైట్ నెస్ బాగా తగ్గిందన్న విమర్శలు లేకపోలేదు. సీదిరి ఇక తగ్గి .. మోదీ గారిని ఆదర్శంగా తీసుకొండి..! అదేదో క్షమాపణలంటా.. చెప్పి మీరు వెలగపెడుతున్న పదవీని కాపాడుకో మరి.. అంటూ డిమాండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా షురూ అయ్యాయి!