పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ లీడ్ రోల్ గా ‘ఆద్య’ పేరుతో వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ వెబ్ సిరీస్ తో తాను రీఎంట్రీ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. పైగా ఇది పాన్ ఇండియా వెబ్ సిరీస్ అని అంటున్నారు. ఇది కేవలం లేడీ ఓరియంటెడ్ కథాంశంతో ఉంటుందట. ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ అని నిర్మాతలు అంటున్నారు. డీఎస్కే స్క్రీన్, సాయికృష్ణ పొడక్షన్ బ్యానర్లపై రావ్. డి.ఎస్, ఎస్. రజనీకాంత్ కలిసి దీన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ వెబ్ సిరీస్ నిర్మాణం ఉంటుందని నిర్మాతలు అంటున్నారు.
యు అండ్ ఐ పద్మనాభరెడ్డి సమర్పిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో నందిని రాయ్ తోపాటు బాలీవుడ్ హీరో ‘వైభవ్ తత్వవాడి’ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు ఈ వెబ్ సిరీస్ ద్వారా ఎం.ఆర్. కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. విజయదశమి సందర్భంగా ఈ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవం నిర్వహించారు. రేణు దేశాయ్ పై చిత్రీకరించిన ముహూర్త సన్నివేశానికి ప్రముఖ దర్శకులు నీలకంఠ కెమెరా స్విచాన్ చేయగా.. డి.ఎస్.రావు క్లాప్ కొట్టారు. ఎం.ఆర్.కృష్ణ మామిదాల దర్శకత్వం వహించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు శివేంద్ర దాశరధి, పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్, బి.వి.వి.చౌదరి, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత రేణుదేశాయ్ ఇందులో నటిస్తుండటంతో అందరి దృష్టీ దీనిపై పడింది. ఏ విషయంలోనూ రాజీపడకుండా దీన్ని నిర్మిస్తామని నిర్మాత ఎస్.రజనీకాంత్ తెలిపారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరధి, కథ-మాటలు: ఆదిత్య భార్గవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కృష్ణ చైతన్యరెడ్డి.ఎస్, సమర్పణ: యు అండ్ ఐ పద్మనాభరెడ్డి











