ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుతున్నాయి. కోవిడ్ తర్వాత కోటీశ్వరుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతే స్థాయిలో పేదరికము పెరిగిందని ఓ సర్వే లో తెలిసింది. తాజాగా
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్స్ ఫోరమ్ అక్స్ఫామ్ ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఇది కేవలం ఇంధనం,ఆహారం, ఫార్మా రంగాలకు చెందిన కంపెనీల్లో గుత్తాధిపత్యం కలిగిన వారికే సాధ్యమైందని ఈ ఆధ్యయనం లో తేలింది. అంటే ప్రతి 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకొచ్చాడని స్పష్టం గా తెలుస్తుంది.ఈ కంపెనీలు రికార్డు లాబాల్ని ఆర్జించాయని లెక్కలు చెప్పారు. ఇక పేదలు కూడా అమాంతం పెరిరిగిపోయారు. ప్రతి 33 గంటలకు దాదాపు 10 లక్షల మంది కడు పేదరికంలోకి వెల్లారని తెలుస్తుంది. ఆర్థిక అసమానలతు ఎలా ఉన్నాయే కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని స్పష్టం గా తెలుస్తుంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రాఫిటింగ్ ఫ్రం పెయిన్ పేరుతో ఆక్స్ ఫామ్ రిపోర్టును విడుదల చేసింది.
కరోనా పుణ్యామని కొందరు తమ సంపదను ఎన్నడూ లేని విధంగా పెచుకున్నారు. పెట్టుబడి దారులకు కరోన కలిసొచ్చింది. గతం లో ఎన్నుడూ లేని విధంగా వారి సంపద రెట్టింపు స్థాయిలో పెరిగిందని స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రాఫిటింగ్ ఫ్రం పెయిన్ పేరుతో ఆక్స్ ఫామ్ విడుదల చేసిన రిపోర్టు తెలిపింది.
ఒక కార్మికుడు 112 ఏళ్లు పనిచేస్తేగానీ సరికాదని ఈ అధ్యాయం తేల్చింది.2020లో 573 మంది కొత్తగా బిలియనీర్లుగా అవతరించారు. అంటే ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ పుట్టుకొచ్చారన్న మాట. అదే ఏడాది 26.3 కోట్ల మంది పేదరికంలోకి జారిపోయారు. అంటే ప్రతి 33 గంటలకు పది లక్షల మంది పేదరికంలోకి జారిపోయారని లెక్కలు చూస్తే తెలుస్తుంది. కేవలం 24 నెలల్లో ఒక బిలియనీర్ల సంపాధన 23 ఏళ్ల సంపధనకు సమానం గా పెరిగింది. ప్రత్యేకంగా ఫార్మరంగం గురించి చెప్పాలంటే 40మంది బిలియనీర్లుగా ఎదిగారు.
ఫార్మా రంగంలో 40 మంది బిలియనీర్లుగా ఎదిగి ప్రతి సెకనుకు వెయ్యి డాలర్ల లాభాన్ని తమ ఖాతాలో వెేసుకున్నారంటే వారి వ్యాపారం ఎలా ఉందో తెలుస్తుంది.ఆహారం,ఫార్మా రంగాల్లో గుత్తాధిపత్యం కలిగిన కంపెనీలు రికార్డు లాబాల్ని సొంత చేసుకున్నాయి. ప్రతి సెకనుకు 2600 డాలర్లు లాభాలు సంపాధిస్తు ప్రపంచం లోనే అతి పెద్ద ఇంధన కంపెనీలైన షెల్, బీపీ, టోటల్ ఎర్జీస్, ఎక్సాస్,షెవ్రాన్ చరిత్రను సృష్టించారు.
పేదోడు తిండికోసం ఏడిస్తే ఉన్నోడు తినేక ఏడ్చిండు అన్న చందంగా మారింది ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరినామాలు. కోవిడ్ తో ఆనార్యంపాలై కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని దేశాల్లో ప్రజలకు రెండో డోస్ కూడా ఇవ్వలేదు. ఉన్నోడు అమాంతం ఆకాశమంత ఎత్తుకు తన సంపధను పెంచుకోగా లేనోడు తిండి కోసం ఏడ్వాల్సి వస్తుంది. ఉన్నోడు లేనోడికి సహాయం చేస్తే ప్రపంచం ముందుకు సాగుతుంది, లేదంటే ఏదో ఒక రోజు ఇరువర్గాల మద్య విబేధాలు పెట్రేగిపోయే ప్రమాధం పొంచి ఉంది..











