‘బాద్షా, ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి సినిమాల్లో నటించినప్పటికీ.. అంతగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది రీతూ వర్మ. అయితే ‘పెళ్ళిచూపులు’ సినిమాతో కథానాయికగా అవకాశం అందుకొని ప్రేక్షకుల మెప్పు పొందింది. ఆ తర్వాత తెలుగులో ‘కేశవ’ సినిమాలో మాత్రమే కనిపించింది. ఆపై తమిళంలో ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొల్లైయడిత్తాల్’ మూవీతో మంచి హిట్ అందుకొని.. అక్కడ మరిన్ని అవకాశాలు దక్కించుకుంది రీతూ వర్మ.
ప్రస్తుతం విక్రమ్ తో ధృవనక్షత్రం లోనూ , ‘చైనా’ అనే మరో మూవీ లో నటిస్తోన్న రీతూ వర్మ.. తెలుగులో నానీ ‘టక్ జగదీష్’ లో కథానాయికగా నటిస్తోంది. అలాగే శర్వానంద్ తో ఒక తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. దాంతోపాటు నాగశౌర్య సరసన ఒక మూవీకి కమిట్ అయింది. తాజా సమాచారం ప్రకారం రీతూ వర్మ మాస్ మహారాజా రవితేజ సరసన కథానాయికగా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
‘రాక్షసుడు’ తో మంచి పేరు తెచ్చుకున్న రమేశ్ వర్మ .. దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ లాయర్ గా నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమా షూటింగ్ లో ఇటీవల తిరిగి పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే రవితేజ రమేశ్ వర్మ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. మరి రీతూకి ఈ సినిమా ఏ రేంజ్ లో అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.











