గుంటూరులో టీడీపీ నేతలపై పోలీసులు రివర్స్ కేసు నమోదు చేశారు. మంత్రి అప్పలరాజు ప్రజలను భయభ్రాంతులకు గురయ్యేలా కరోనా గురించి మాట్లాడారని నిన్న కొందరు టీడీపీ నేతలు గుంటూరు అరుండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు తీసుకున్నా, కేసు మాత్రం నమోదు చేయలేదు. అయితే ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన టీడీపీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి కోవెలమూడి రవీంధ్రతో సహా పది మందిపై 188, 269 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
చంద్రబాబుపై కూడా కేసు నమోదు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కరోనా గురించి ప్రజలను భయభ్రాంతలకు గురిచేస్తున్నారంటూ గుంటూరు అరుండల్ పేట పోలీస్ స్టేషన్లో ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. మంత్రి అప్పలరాజుపై ఇచ్చిన ఫిర్యాదును మాత్రం పక్కన పడేయడంతోపాటు, ఫిర్యాదు చేసిన వారిపైనే రివర్స్ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.










