మాజీ మంత్రి, వైసీపీ నేత RK రోజా..ఇప్పుడు సైలెంట్ అయ్యారా? పార్టీలో ఆమె క్రియాశీలకంగా లేరా.? పార్టీలో ఇతరులపై విమర్శలు వస్తే ఎలా స్పందించాలి? వాటిని ఆమె లైట్ తీసుకుంటున్నారంటే.. అవతలి వ్యక్తి తప్పు చేశారని రోజా ఒప్పుకుంటున్నారా.? లేక, ఆమె పార్టీలో యాక్టివ్‌గా లేరా.? వీటికి మించి అవతలి వ్యక్తిపై ఆమెకి తీవ్ర ఆగ్రహం, కోపం ఉన్నాయా.? ఇదే ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది..
గతంలో వైసీపీపై లేదా ఆ పార్టీ నేతలపై విమర్శలు వస్తే చాలు మీడియా ముందుకొచ్చి రోజా గట్టిగా బదులిచ్చేవారు. వైసీపీ పార్టీలోనూ రోజాకు అదే స్థాయిలో గుర్తింపు ఉంది. ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె… మీడియా ముందు విరుచుకుపడతారు.. ఈ దూకుడు కొన్ని సార్లు ఆమె వ్యవహార శైలి పార్టీకి మైనస్‌గా మారిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ నేతలను తిట్టడం, వారితో అదే స్థాయిలో తిట్లు పడడం రోజాకు అలవాటే.
ఐతే పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుండి రోజా సెలక్టివ్‌గా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల మాజీ మంత్రి విడుదల రజినీ, చిలకలూరి పేట సీఐ సుబ్బారాయుడి వివాదం జరిగిన విషయం తెలిసిందే. సీఐ సుబ్బరాయుడు తనపై అనుచితంగా ప్రవర్తించాడంటూ ఆరోపించారు విడదల రజిని.. లైవ్ లో విజువల్స్ ఆమె ఆరోపణలకు బిన్నంగా ఉన్నాయి.. రజిని పీఏపై పలు ఆరోపణలు ఉన్నాయి.. గతంలో అతను పలువురిని బెదిరించి డబ్బు వసూలు చేశాడనే పలు ఫిర్యాదులు ఉన్నాయి.. వీటిపై ఆధారాలు సేకరించేందుకు, రజిని మరిది గోపీ కేసులపై విచారించేందుకు రజిని పీఏని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మహిళా నేతలు నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఘాటుగానే స్పందించారు.
ఈ అంశంపై మాజీ మంత్రి రోజా సైలెంట్‌గా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి విడదల రజినిపై వచ్చిన ఆరోపణలను రోజా అంగీకరించారా.? అందుకే, ఆమె వ్యూహాత్మకంగా మౌనం వహించారా?. లేక, పార్టీలో రజినికి ఇస్తున్న ప్రాధాన్యత రోజా భరించలేకపోతున్నారా.? అనేది వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది.. విడదల రజిని గ్రాఫ్ తగ్గుతున్న టైమ్‌లో తాను ఎంటర్ అవడం ఎందుకు అని రోజా భావిస్తున్నారని, అందుకే, ఆమె సైలెంట్‌గా ఉన్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.. అయితే, విడుదల రజినీపై సీఐ వ్యవహరించిన తీరుపై రోజా మాట్లాడి ఉంటే బాగుండేదని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.











