ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్. కుటుంబ సమేతంగా రాత్రి 7 గంటల 2 నిమిషాలకు ప్రధాని అధికారిక నివాసం 7-లోక్ కల్యాణ్ మార్గ్‌కు వెళ్లిన లోకేష్ దాదాపు 2 గంటల పాటు ప్రధానితో సమావేశమయ్యారు. గతంలో పలుమార్లు లోకేష్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు ప్రధాని మోదీ. ఏపీ పర్యటనకు వచ్చిన పలు సందర్భాల్లో ఢిల్లీకి కుటుంబ సమేతంగా రావాలని లోకేష్‌ను కోరారు. ఐతే బిజీ షెడ్యూల్ కారణంగా లోకేష్ వెళ్లలేకపోయారు. తాజాగా వీలు కుదరంతో సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ ఏడాది జనవరి 8న మోదీ తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఇక ఇటీవల అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ రెండు సందర్భాల్లోనూ తనకు స్వాగతం పలికిన లోకేశ్‌ను..దిల్లీకి వచ్చినప్పుడు తనను ఎందుకు కలవలేదని ఆరా తీశారు. ఈసారి వచ్చినప్పుడు కలవాలని ప్రత్యేకంగా చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకొని శనివారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ.. లోకేశ్, ఆయన కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశారు. లోకేష్ కుమారుడు దేవాంశ్‌తో మోదీ సరదాగా గడిపారు.
ప్రధానితో ఈ సమావేశం లోకేశ్ కుటుంబానికి ఎంతో చిరస్మరణీయంగా నిలిచిపోనుంది. 2024 ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా 3,132 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర చరిత్రాత్మకంగా సాగిన విధానాన్ని వివరిస్తూ ప్రచురించిన యువగళం కాఫీ టేబుల్ బుక్‌ను..ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మోదీ ఒక పుస్తకంపై సంతకం చేసి లోకేశ్‌కు బహూకరించారు. ఇది అరుదైన, మధురమైన జ్ఞాపకం. ఈ సమావేశం సందర్భంగా బ్రాహ్మణి, దేవాంశ్‌లను ప్రధాని ఆశీర్వదించారు. రాష్ట్ర పురోగతికి నిరంతరం చేయూతనందిస్తున్నందుకు మోదీకి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ భద్రత, దేశపురోగతి కోసం ప్రధాని అందిస్తున్న బలమైన, నిర్ణయాత్మక నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
లోకేశ్ స్పెషల్ భేటీపై వైసీపీ నేతలలో టెన్షన్ మొదలయింది.. గతంలో జగన్ అయిదేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించినా, ఆయనని ఏనాడూ ఫ్యామిలీతో కలిసి తనను కలవాలని కబురు పంపలేదు ప్రధాని నరేంద్ర మోదీ.. లోకేశ్‌పై ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.. ఇదే ఇప్పుడు జగన్ టీమ్‌ని పీడకలలా వెంటాడుతోంది.. ఈ భేటీ తర్వాత ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకునే చాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు రాజకీయ పరిశీలకులు.. ఈ భేటీలో జగన్ అరెస్ట్‌పై చర్చ జరిగిందా..?? లేదా..?? అనే అంశంపై వైసీపీ ఆరా తీస్తోంది.. మరి, వారికి ఎలాంటి సమాచారం అందిందో త్వరలోనే క్లారిటీ రానుంది..











