భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ బాలీవుడ్ అరంగేట్రం చేయనుందా ? ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్ లో ఈ చర్చ హాట్ హాట్ గా జరుగుతోంది.24 ఏళ్ల సారా లండన్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ పిల్లలలో ఒకరైన సారా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సారా రెగ్యులర్ అప్డేట్స్ తో సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు.
అయితే సారాకు మొదటి నుంచి నటన పై ఆసక్తి ఎక్కువని తెలుస్తోంది. అందుకే ఆమె ఒకవైపు మెడిసిన్ చదువుతూనే మరోవైపు మోడలింగ్, యాక్టింగ్ పై శిక్షణ కూడా పొందారట.ఇప్పటికే సారా, వివిధ సౌందర్య, ఫ్యాషన్ ఉత్పత్తులకు సారా మోడల్‌గా కూడా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇక తాజాగా ఆమె పోస్టు చేసిన ఓ వీడియో.. గ్లామర్ వరల్డ్‌లోకి అడుగుపెట్టడానికే అన్నట్టుగా ఉందనే గుసగుసలు బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.కట్టిపడేసే అందంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించే సారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందా అనే అంశంపై క్లారిటీ రావాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.