వైసీపీలో నెంబర్ 2గా అపరమిత అధికారాలు అనుభవిస్తోన్న సజ్జలకి జగన్ చెక్ పెడుతున్నారా?? తాడేపల్లి ప్యాలెస్‌లో ఆయనకి వ్యతిరేకంగా ఓ టీమ్ నడుస్తోందా.?? ఆయనని జగన్ టీమ్ నుండి పక్కన పెట్టడానికి ప్యాలెస్‌లో స్కెచ్ వేస్తున్నారా.?? ఇటీవల సజ్జల భూబాగోతం బయటకు వచ్చింది.. ఇదే అదనుగా ఆయనను కోర్ టీమ్ నుండి తప్పించడానికి సరైన సమయంగా భావించిన ఇతర నేతలు… సజ్జలకి ఉచ్చు బిగిస్తున్నారని వైసీపీ వర్గాల నుండి వినిపిస్తోన్న వదంతులు..
జగన్ అధికారంలో ఉన్న సమయంలో సజ్జల సుమారు 59 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని కథనాలు వెలుగులోకి వచ్చాయి.. దీనిపై తొలి దశ దర్యాప్తులో సజ్జల ఆక్రమించినట్లు నిర్ధారణ జరిగింది.. తాజాగా, మరో దశ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఆ తరవాత అరెస్ట్ ఖాయం అని తెలుస్తోంది.. సజ్జల అవినీతితోపాటు పార్టీలో ఆయనపై అసంతృప్తి పెరగడానికి మరో కారణం.. ఇప్పటికీ పార్టీలోని పలు విభాగాలు ఆయనతోనే ఉన్నాయి.. పార్టీ యువజన, విద్యార్ధి, మేధావుల ఫోరంకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు సజ్జల.. ఇది కొంతమందికి నచ్చడం లేదు..
బుధవారం తాడేపల్లి ప్యాలెస్‌లో పార్టీలోని పలు విభాగాల మీటింగ్ జరిగింది.. ఈ సమావేశంలో చంద్రబాబు సర్కార్‌పై పార్టీ నేతలు దూకుడు పెంచాలని, విమర్శలు చేయడంతోపాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా వ్యవహరించాలని ఓ పోస్ట్ చేశారు సజ్జల.. అనూహ్యంగా సజ్జల పోస్ట్‌పై సోషల్ మీడియాలోనే పార్టీ కార్యకర్తలు నెగిటివ్ కామెంట్స్ చేశారు.. కొందరు ఆయనని ట్రోల్ చేశారు.. కొందరు నేతల సూచనలు లేకుండా టార్గెట్ చేయరని, తాడేపల్లి ప్యాలెస్‌లోని ఓ టీమ్ తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని భావిస్తున్నారట సజ్జల.. దీంతో, ఆయనకు త్వరలోనే చెక్ పడడం గ్యారంటీ అని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు..
వైసీపీ అధికారంలో ఉన్న గత అయిదేళ్ల సమయంలో దాదాపు అనధికారిక ముఖ్యమంత్రిగా వ్యవహరించారు నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.. షాడో సీఎంగా సజ్జల ఇటు వైసీపీని, అటు ప్రభుత్వాన్ని నడిపించారు.. మంత్రులని, ఇతర కీలక నేతలని పక్కన పెట్టి ఆయన సకల శాఖమంత్రిగా వ్యవహరించారు సజ్జల.. నాడు ఆయన అనుభవించిన వైభోగం అంతా ఇంతా కాదు.. చెలాయించిన అధికారం కూడా అసామాన్యం, అసాధారణం.. ముఖ్యమంత్రిగా జగన్ ప్యాలెస్‌కి పరిమితం అయితే, సజ్జల మాత్రం పవర్ అనుభవించారు.. జగన్ ఓటమిలో ఐ ప్యాక్ టీమ్‌ది కొంత భాగం, మిగిలినది సజ్జలది అని చెబుతారు వైసీపీ నేతలు. వైసీపీ ఓటమికి బాధ్యుడిగా సజ్జల తీసుకోవాలనే డిమాండ్ కూడా ఉంది.. పార్టీ కేడర్‌లో సజ్జలపై వ్యతిరేకతకి, ఆయనపై వచ్చిన అవినీతి కుంభకోణం, ఆయన వారసుడు సజ్జల భార్గవ్ రెడ్డి అరాచకాలు గుర్తుకు తెచ్చి మరీ టార్గెట్ చేస్తున్నారు.. మరి, వీరి ప్రయత్నం ఫలిస్తుందా.?? జగన్‌కి కన్ను, చెవిలాంటి సజ్జలని పక్కన పెడతారా.?? లేదా.? అనేది చూడాలి..










