టీడీపీ – జనసేన మధ్య బంధాన్ని ఎలా బ్రేక్ చేయాలి..? ఆ రెండు పార్టీల కామన్ ఓట్ బ్యాంక్‌ని ఎలా బద్దలు కొట్టాలి.?? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మధ్య పొరపొచ్చాలు ఎలా సృష్టించాలి…?? ఇదీ వైసీపీ నేతల ప్రధాన టార్గెట్‌గా మారింది.. గురువారం ఉదయం పిఠాపురం టీడీపీ నేత వర్మ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో ఓ వీడియో ప్రత్యక్షం అయింది.. కష్టపడి గెలవాలి.. అని ఆ వీడియో సారాంశం.. ఈ వీడియోలో డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ లేరు.. ఇటీవలి ఎన్నికలలో వర్మ ప్రచారం చేసిన విజువల్స్‌తో ఈ వీడియోని చేశారు..
ఈ వీడియో ఇలా పోస్ట్ అయిందో లేదో వైసీపీ నేతలు, కార్యకర్తలు పండగ చేసుకున్నారు.. ఈ వీడియో పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా టీడీపీ నేతలు పోస్ట్ చేయించారని కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు వర్మ ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని, తన నియోజకవర్గంలో పవన్ పోటీ చేయడం ఆయనకు ఇష్టం లేదని అర్ధం అవుతోందని వ్యాఖ్యలు చేశారు.. సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.. భారీగా ట్రోల్ చేశారు.. దీనిపై వైసీపీ మద్దతుదారులు, ఆ పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు శునకానందం పొందారు.. టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ వస్తే, తమకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకున్నారు..
వీరికి గంటల వ్యవధిలోనే చెక్ పెట్టేశారు ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ.. ఈవీడియోపై ఆయన వెంటనే వివరణ ఇచ్చారు.. `నా సోషల్ మీడియా అకౌంట్స్ గత 3 సంవత్సరాలుగా హైదరాబాదు లోని సోషల్ ప్లానెట్ సంస్థ మెయింటైన్ చేస్తూ ఉంటుంది.ఈరోజు నా ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో కి నాకు ఎటువంటి సంబంధం లేదు సోషల్ మీడియాలో నా ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ వారు తప్పుడు వార్త పోస్ట్ చేసిన విషయం తెలుసుకొని వెంటనే సోషల్ మీడియా సిబ్బందిని హెచ్చరించి దానిని డిలీట్ చేపించడం జరిగింది. నా పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం జరిగింది` అని తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ చేశారు..
ఈ ఒక్క పోస్ట్‌తో వైసీపీ కార్యకర్తల ఆనందంపై వర్మ నీళ్లు చల్లారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. టీడీపీ – జనసేన మధ్య ఆల్ ఈజ్ వెల్ అయితే, తమకు ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తోన్న ప్యాలెస్ కార్యకర్తలు.. ఈ పోస్ట్‌తో ఉసూరుమన్నారు.. తమ పప్పులు ఉడకలేదని నీరసించిపోయారట.. సరిగ్గా ఇదే టైమ్‌లో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణస్వీకార వేదికపై ప్రధాని మోదీ … సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజువల్స్ చూసి కుంగి కుశించిపోయారు.. తమకు బ్యాడ్ టైమ్ నడుస్తోందని సరిపుచ్చుకున్నారట వైసీపీ నేతలు..











