తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హోరాహోరీగా ప్రచారం చేశారు. వైసీపీ పాలనను, నాయకుల తీరును ఎండగడుతూ అద్భతంగా ప్రసంగాలు చేశారు. ఒకవైపు ప్రజా సమస్యలపై మాట్లాడుతూనే, మరోవైపు వైసీపీ నాయకులకు చురకలంటించారు. సవాల్ కు ప్రతిసవాల్ విసురుతూ తిరుపతి ఎన్నిక ప్రచార పర్వంలో హైలైట్ గా నిలిచారు. జగన్ ను జాంబిరెడ్డితో పొల్చడం, వైసీపీ ఎంపీలను రొబోలుగా మారారని సైటర్స్ బాగా వేయడంతో లోకేశ్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. లోకేశ్ గతంలో కంటే అద్భుతంగా ప్రసంగాలు చేస్తున్నారని తెలుగు ప్రజలతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా ప్రశంసించారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రాయవరం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా లోకేశ్ మీడియాతో మాట్లాడుతుండగా ‘‘ సార్ మీరూ తెలుగు మీద బాగా పట్టు సాధించారు కదా’’ అని అడగడంతో నవ్వుతూ.. ‘నన్ను పొగిడితే నీ ఉద్యోగం పోతోంది జాగ్రత్త’’ అంటూ లోకేశ్ సమాధానమిచ్చార.
Also Read:బాలయ్య మామయ్య లుక్స్ అదుర్స్ : ‘అఖండ’ దుమ్మురేపుతోందని లోకేశ్ ట్వీట్