బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ అనగానే సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు రావడం కూడా అందుకు కారణం. ‘ఉగాది‘ పండగ సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఆయన లుక్ మంచి మార్కులు కొట్టేసింది. హరహర మహాదేవ అంటూ దుర్మార్గులపై ఆయన విరుచుకుపడిన తీరుకి మంచి రెస్పాన్స్ వస్తోంది. 24 గంటలు పూర్తి కాకుండానే 6 మిలియన్లకి పైగా వ్యూస్ ను సాధించి నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా స్పందించారు. బాలయ్య మామయ్య లుక్స్ అదిరిపోయాయని, బ్లాక్ బస్టర్ కాబోతోంది అన్నారు. ‘అఖండ’ సినిమా టీజర్ దుమ్మురేపుతోందని ట్వీట్ చేశారు.
Must Read ;- పులివెందుల పిల్లి పారిపోయింది : నారా లోకేశ్