లేడీ ఓరియంటెడ్ పాత్రల వైపు మొగ్గుచూపే నయనతార ‘నేత్రికన్’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాకి సంబంధించి విశేషమేమిటంటే తన పెళ్లి చేసుకోబోయే విఘ్నేశ్ శివన్ దీనికి నిర్మాత కావడం. డీస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఈ సినిమా స్ట్రీమింగ్ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. తెలుగు వెర్షన్ ను కూడా చూడవచ్చు. థ్రిల్లర్ జోనర్ సినిమాలను కోరుకునే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉండవచ్చేమో. కొరియన్ హిట్ థ్రిల్లర్ ‘బ్లైండ్’ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.
ఇందులో అంధురాలి పాత్రను నయన్ పోషించింది. అజ్మల్ అమీర్ మరో కీలక పాత్రను పోషించారు. ఓ యాక్సిడెంట్ తో ముడిపడిన కథ ఇది. ఈ యాక్సిడెంట్ కు ఆమె ప్రత్యక్ష సాక్షి. ఎవరు చేశారో చెప్పడానికి ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో కళ మలుపు తిరుగుతుంది. దాంతో ఆమె జీవితం ప్రమాదంలో పడుతుంది. హంతకుడు ఆమెను వేటాడటం మొదలుపెడతాడు. విఘ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స, క్రాస్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించారు. ఇంధుజ, మణికందన్ పట్టాంబి, శరణ్ తదితరులు నటించారు.
మిలింద్ రావ్ దీనికి దర్శకత్వం వహించారు. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. చివరికి ఓటీటీలో విడుదలవుతోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదలైంది. ఇది లేడీ ఓరియంటెడ్ డ్రామా. తనకు ఎదురైన ఆటంకాలను ఆమె ఎలా ఎదుర్కొంది అన్నదే ప్రధాన కథ. ఇందులో నయనతారది పోలీస్ పాత్ర అని కూడానట. ఈ సినిమా రివ్యూని మరికొద్ది సేపట్లో తెలుసుకుందాం.











