తెలుగు రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 4 ప్రేక్షకులను అలరిస్తూ ఆరు వారాలను పూర్తి చేసుకుంటోంది. ఈ షోకు ప్రధాన బలం నాగార్జున అక్కినేని హోస్టింగ్. అయితే ఈ షోలో కొన్ని వారాలపాటు నాగ్ కనిపించబోవడం లేదట. దీనికి కారణం నాగ్ ‘వైల్డ్ డాగ్’ షూటింగ్. ఇప్పటికే కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఇప్పుడు తిరిగి మొదలయింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం నాగ్ హిమాలయాలకు వెళ్ళారు. హిమాలయాలలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని అక్కడినుంచి థాయ్‌లాండ్ వెళ్లబోతున్నాడట నాగ్.
ఈ కారణంగా నాగార్జున ‘బిగ్ బాస్ 4’కి అందుబాటులో ఉండబోవడం లేదట. అయితే నాగార్జున స్థానంలో వచ్చేది ఎవరు అని సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ‘బిగ్ బాస్ 4’ వ్యాఖ్యాత కోసం సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే నాగార్జున స్థానంలో ఆయన కోడలు, స్టార్ హీరోయిన్ సమంత అక్కినేనిని వ్యాఖ్యాతగా కనిపించేలా బిగ్ బాస్ నిర్వాహకులు ఒప్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. సమంత కూడా ‘బిగ్ బాస్ 4’కు వ్యాఖ్యాతగా ఉండడానికి గ్రీన్ సిగ్నెల్ కూడా ఇచ్చారని టాక్.
‘బిగ్‌బాస్’ సీజన్ 3 సమయంలో కూడా నాగార్జున షూటింగ్ కోసం కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటే ఆ స్థానంలో రమ్యకృష్ణ ‘బిగ్‌బాస్’ షోకు హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి ఈ సీజన్ లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఒకవేళ సమంతపై వస్తున్న వార్తలు నిజమైతే ‘బిగ్ బాస్’ షోకు కొత్తదనం వస్తుంది అనడంలో సందేహం లేదు. అన్నీ అనుకునట్లు జరిగితే సమంత చేస్తున్న తొలి బుల్లితెర ఎంట్రీ ఇదే అవుతుంది. అంతే కాకుండా సమంత ప్రేకకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది మరింత ఆసక్తిగానూ మారింది. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే ప్రేక్షకులు ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.