Samantha Defamation Claim On Youtube Channels
సమంత దూకుడు పెంచింది. ఓ పక్క ఆమెకు సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇంకో పక్క తన పరువుకు భంగం కలిగించే వీడియో చేసిన యూట్యూబ్ ఛానెల్స్ మీద కూడా కసి తీర్చుకుంటోంది. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్టు తెలిశాక యూట్యూబ్ ఛానెల్స్ రకరకాల వీడియోలు చేశాయి. దీని మీద నెటిజన్లు కూడా ట్రోల్స్ చేశారు. వారు విడిపోవడానికి కారణాలు ఇవేనంటూ కొన్ని ఛానెల్స్ వార్తలు చేయడం మీద సమంత స్పందించింది. దీని మీద ఆమె కోర్టుకు ఎక్కింది.
తన పరువుకు భంగం కలిగించారంటూ మూడు ఛానల్స్ మీద కూకట్ పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసింది. వాటిలో సమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ ఉన్నట్లు తెలుస్తోంది. వెంకట్రావు అనే ఓ లాయర్ మీద కూడా కేసు వేసింది. ఈ కోర్టులో సమంత తరఫున హైకోర్టు న్యాయవాది బాలాజీ వాదించనున్నారు. సమంత మాత్రం తన స్నేహితురాలు శిల్పా రెడ్డి, మరి కొందరితో కలిసి డెహ్రాడూన్ కు వెళ్లినట్టు తెలిసింది. అక్కడ వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Samantha Defamation Claim On Youtube Channels
ఇదిలా ఉండగా ఆమెకు సినిమాల్లోనూ వెబ్ సిరీస్ లోనూ నటించేందుకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఓ క్రేజీ ఆఫర్ కూడా సమంతకు వచ్చినట్టు తెలిసింది. బాలీవుడ్ బాద్షా షారుక్ – అట్లీ కాంబినేషన్ లో రూపొందే సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తున్నట్లు సమాచారం. మొదట ఈ పాత్ర కోసం నయనతారను సంప్రదించిన తర్వాత చివరకు సమంతను ఎంపిక చేశారని తెలిసింది. దీనికి ఆమెకు ఏడు కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వనున్నట్లు తెలిసింది. గతాన్ని మరచిపోయి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆమె తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటోంది.











