RS 50 Cr For Radhe Shyam Climax
రాధేశ్యామ్ క్లైమాక్స్ కి భారీగా ఖర్చయిందా? అంత భారీగా ఖర్చయ్యేందుకు ఆ లవ్ స్టోరీలో ఏముంది? అన్న ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు యు.వి. క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇప్పటి వరకు రిలీజైన రాధేశ్యామ్ పోస్టర్స్ అండ్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ మూవీ క్లైమాక్స్ కోసమే భారీగా ఖర్చు చేశారట. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్నఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
RS 50 Cr For Radhe Shyam Climax
అయితే.. ఈ మూవీ క్లైమాక్స్ సీన్స్ కోసమే దాదాపు 50 కోట్లు మేకర్స్ ఖర్చు చేసినట్టు తెలిసింది. ముందు నుంచి చిత్ర యూనిట్ రాధే శ్యామ్ లో క్లైమాక్స్ చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని చెబుతూ వస్తున్నారు. ఈ కథకు ఇందులోని క్లైమాక్స్ కు అంత బడ్జెట్ కేటాయించడం అవసరమట. ఈ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ గురించి అందరూ మాట్లాడుకునేలా ఉంటుంది అంటున్నారు. ఇది తెలిసిన దగ్గర నుంచి అభిమానుల్లో రాధేశ్యామ్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. మరి.. సంక్రాంతికి రానున్న రాధేశ్యామ్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.