నాగ చైతన్య సరసన నటించిన ‘ఏ మాయ చేసావే’ చిత్రం ద్వారా సమంత అక్కినేని టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్. నటన మాత్రమే కాదు సమంత సామాజిక కార్యకలాపాల్లో కూడా చురుకుగా పాల్గొంటోంది. కొన్ని నెలల క్రితం, ఆమె హైదరాబాద్‌లో ప్రీ-స్కూల్ ‘ఏకం-ప్రారంభ అభ్యాస కేంద్రం’ ప్రారంభించడం ద్వారా వ్యాపారవేత్తగా మారింది. ఇటీవల, ఈ నటి ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ‘సమంతా సాకి వరల్డ్’ పేరుతో ఫ్యాషన్ స్టోర్ ను ప్రారంభించింది.
సెలబ్రిటీలు ధరించే దుస్తులను షోరూమ్‌లో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఫ్యాషన్ స్టోర్ ప్రారంభం సందర్భంగా ‘ఒక సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన నా భార్య సమంత అక్కినేనికి శుభాకాంక్షలు. చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. sa-aki.com ఇప్పుడు అందుబాటులో ఉంది” అంటూ నాగ చైతన్య ట్విట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ ట్విట్టర్ ప్రపంచంలో వైరల్ గా మారింది. ప్రస్తుతం సినిమా షూటింగులు ఎలాగూ లేవు కాబట్టి సమంత ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల మీద దృష్టిసారించినట్లు కనిపిస్తోంది.











