సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్ష్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ విడుదలైంది. కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల సమక్షంలో చిత్ర యూనిట్ ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. యాక్షన్ సీన్‌తో ట్రైలర్ స్టార్ట్ అవగా, ఆ సీన్ లో
‘యు కెన్ స్టీల్ మై లవ్ .. నా ప్రేమను దొంగలించగలవు..
యు కెన్ స్టీల్ మై ఫ్రెండ్ షిప్ .. నా స్నేహాన్నీ దొంగలించగలవు..
బట్, యు కాంట్ స్టీల్ మై మనీ.. ’ అంటూ మహేశ్ తనదైన స్టైల్‌లో పవర్‌ఫుల్ డైలాగ్ తో అలరించారు. ఇక పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా అలరించనుంది.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. ఇప్పటికే ట్రైలర్ చూసిన అభిమానులు మూవీ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ట్రైలర్ ఈ రేంజ్‌లో ఉంటే ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులపడం పక్కా అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.