ఆర్.ఎక్స్ 100 తో టాలీవుడ్ లో సంచలన విజయం సాధించాడు దర్శకుడు అజయ్ భూపతి. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ తో రెండో సినిమా ఈ పాటికే స్టార్ట్ అయిపోవాలి లెక్క ప్రకారం. అయితే కేస్టింగ్ సెలెక్షన్ ఆలస్యం అవడం వల్ల రెండో సినిమా ఇప్పటికీ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళ లేకపోయింది. ఎట్టకేలకు ‘మహాసముద్రం’ టైటిల్ తో.. ఒక రొమాంటిక్ ఇంటెన్స్ లవ్ స్టోరీని శర్వనంద్ హీరోగా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు అజయ్ భూపతి. ఇందులో తమిళ హీరో సిద్ధార్థ కూడా ప్రధాన పాత్ర పోషించబోతున్నాడు. ‘గృహం’ తర్వాత బొమ్మరిల్లు బాయ్ నటిస్తోన్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.
ఇక ‘మహాసముద్రం’ సినిమా మొదటి షెడ్యూల్ నవంబర్ లో గోవాలో ప్రారంభం కానున్నదనే వార్తలొస్తున్నాయి. కీలకమైన సన్నివేశాలు అక్కడే చిత్రీకరణ జరుపుకోనున్నాయి. అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు గా నటిస్తోన్న ‘మహాసముద్రం’ సినిమా .. ఒక సముద్రతీరం బ్యాక్ డ్రాప్ లో మహా అనే అమ్మాయి కథ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఇందులో అదితీరావు హైదరి పాత్ర… ఆర్.ఎక్స్ 100 లో పాయిల్ రాజ్ పుత్ తరహాలో నెగెటివ్ షేడ్స్ లో ఉంబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సరైన హిట్స్ లేని శర్వానంద్ మహాసముద్రం చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ‘మహాసముద్రం’ మూవీ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను ముంచెత్తుతుందో చూడాలి.











