ప్రస్తుతం పార్టీ నిర్మాణంపైనే దృష్టి పెట్టామని, షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తారన్నది వాస్తవం కాదని ఆమె అనుచరుడు కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఏప్రిల్‌లో ఖమ్మంలో నిర్వహించే సభకే తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఖమ్మంలో నిర్వహించే సభ ఏర్పాట్ల కోసం కో ఆర్డినేటర్‌ను నియమించామని, పార్టీ పేరు , విధివిధానాలు ప్రకటించకుండా పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని ఆయన అన్నారు. కాగా, పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తున్నట్లు బుధవారం మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి.
Must Read ;- షర్మిలను కలిసిన ఆనం మీర్జా, అసద్