సోనూ సూద్ చేతుల్లో సోనాలి సూద్ ఉంటే ఎలా ఉంటుంది?.. రియల్ హీరోకి అలాంటి అనుభూతి కూడా మిగిలింది.మానవత్వం ఉండే మనుషుల్ని జనం ఎంతగా గుర్తు పెట్టుకుంటారనడానికి సోనూ సూద్ జీవితమే ఓ ఉదాహరణ. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆయన స్పందించిన తీరుకు జనం ఆయనను దేవుడిలా కొలుస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఖమ్మంలో ఓ దంపతులు తమకు పుట్టిన బిడ్డకు సోనూ పేరు కలిసి వచ్చేలా సోనాలి సూద్ అని నామకరణం చేశారు. ఈ విషయం కాస్తా సోనూ సూద్ దృష్టికి వెళ్లింది.
ఖమ్మానికి చెందిన నాగరాజు, లక్ష్మి దంపతులు సోనూ సూద్ ను కలిసి ఆ బిడ్డను చూపించారు. వెంటనే సోనూ సూద్ ఆ బిడ్డను ఎంతో ఆప్యాయంగా ఎత్తుకున్నారు. సోనూ ఆనాడు స్పందించిన తీరు నేడు ఆయనకు ఎన్నో మధురానుభూతుల్ని మిగుల్చుతోంది. ప్రముఖ షెఫ్ వికాస్ ఖన్నా సోనూ సూద్ చేస్తున్న సాయానికి స్పందించి గౌరవసూచకంగా ఆయన సొంత ప్రాంతం మోగా (పంజాబ్) పేరును తాను రూపొందించిన ఓ డిష్‌కు పెట్టిన సంగతి తెలిసిందే. ఇలా చాలామంది తమ వ్యాపార సంస్థలకు కూడా సోనూ పేరును పెట్టుకున్నారు.
కరోనా వైరస్ కు వచ్చిన వ్యాక్సిన్ ఎంతలా పనిచేస్తుందో తెలియదుగానీ చాలామందికి మాత్రం సోనూ సూద్ పెద్ద వ్యాక్సిన్ అయిపోయారు. సాధారణంగా సినిమా రంగంలో పెద్ద స్థాయిలో ఎదిగిన వారు బౌన్సర్ల సెక్యూరిటీతో ఉంటుంటారు. ఎవరూ వారిని కలవడానికి కూడా అనుమతించరు. సోనూ ఇప్పుడు రియల్ హీరోగా ఎదిగినా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఎవరైనా ఆయనతో సెల్పీలు దిగాడానిక వస్తే ఆయనే పిలిచి మరీ సెల్ఫీలు తీసుకోమంటారు. మనం తగ్గినప్పుడే మన స్థాయి పెరుగుతుందనడానికి ఓ ఉదాహరణగా కూడా సోనూను చూడవచ్చు.
అన్నప్రాశనకు ఆహ్వానం
ఖమ్మం జిల్లాకు చెందిన ఈ దంపతులది బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామం. సోనాలి తండ్రి ఆర్.ఎం.పి. వైద్యుడిగా పనిచేస్తుంటారు. ఫిబ్రవరి 2న ఈ పాపకు అన్నప్రాశన చేశారు. దీనికి రావాల్సిందిగా సోనూకు కూడా వీరు ఆహ్వానం పంపారు. ఆ పత్రిక కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎట్టకేలకు ఈ దంపతులు తనను కలిసే అవకాశం కల్పించారు సోనూ సూద్. అంతేకాదు వారితో సెల్ఫీ కూడా దిగారు.
Must Read ;- స్పైస్ జెట్ పై సోనుసూద్ బొమ్మ ఎందుకో?