September 11, 2026 7:38 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

లిక్కర్‌ స్కామ్‌లో ఊహించని ట్విస్ట్‌.. సిట్‌ సంచలనం..!

August 13, 2025 at 7:20 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ లిక్కర్ స్కామ్‌ విచారణ ఫైనల్ స్టేజ్‌కు చేరినట్లే కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్‌లో బిగ్‌బాస్‌ ఎవరో సిట్‌ నిర్ధారణకు వచ్చేసింది. ఏపీలో 2019-24 మధ్య ఐదేళ్ల పాటు సాగిన లిక్కర్ స్కామ్‌లో అప్పటి ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్‌ జగన్‌ పాత్ర ఉందని అనుబంధ ఛార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొంది సిట్‌. లిక్కర్ వ్యాపారం ద్వారా వేల కోట్లు దోచుకోవడానికి జగన్‌ ఏయే నిర్ణయాలు తీసుకున్నారో కూడా సిట్ వివరించింది. సిఫార్సులకు భిన్నంగా అధికారుల నియామకాలు ఎలా జరిగాయో కూడా వెల్లడించింది.

లిక్కర్ స్కామ్‌ కేసులో CMO మాజీ కార్యదర్శి, రిటైర్డ్ IAS ఆఫీసర్ కాల్వ ధనుంజయరెడ్డి (A-31), జగన్‌ OSD పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి (A-32), భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీ (A -33) ప్రమేయం, పాత్రకు సంబంధించి సిట్‌ అభియోగాలు మోపింది. విజయవాడ ACB కోర్టులో సిట్‌ అధికారులు సోమవారం అనుబంధ అభియోగపత్రం దాఖలు చేశారు. మొత్తం 124 పేజీలు..16కు పైగా వాల్యూమ్స్‌ సమర్పించారు. గతంలో వేసిన ప్రాథమిక అభియోగపత్రంలో ఏడుగురు వ్యక్తులు, 9 సంస్థలపై అభియోగాలు మోపగా…వాటికి అదనంగా ఇప్పుడు కొత్తగా ముగ్గురు నిందితులపై సిట్‌ అభియోగాలు నమోదు చేసింది. దీంతో 10 మంది వ్యక్తులు, 9 సంస్థలపై ఇప్పటివరకూ అభియోగాలు నమోదు చేసినట్లైంది.

తాజా అభియోగపత్రంలో హవాలా లావాదేవీలు, డొల్ల కంపెనీలకు సంబంధించిన నకిలీ డైరెక్టర్ల వివరాలు తదితర అంశాలను పొందుపరిచింది.ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేలా పక్కా ప్లాన్‌తో స్కామ్‌ చేశారని వివరించింది. దాదాపు రూ.3,500 కోట్ల విలువైన ఈ స్కామ్‌ మూలాలు చాలా లోతుకు విస్తరించి ఉన్నాయని పేర్కొంది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులు A-2 వాసుదేవరెడ్డి, A-3 సత్యప్రసాద్‌ల నియామకానికి సిఫార్సు చేసింది నాటి సీఎం జగన్‌కు ముఖ్య సలహాదారుగా ఉన్న అజేయ కల్లం అని కూడా ఈ చార్జిషీట్‌లో వివరించింది.

అనుబంధ ఛార్జిషీట్‌లో కీలక అంశాలు –

ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే మద్యం విధానంలో మార్పులకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. 2019 సెప్టెంబరు 30 వరకు మద్యం దుకాణాల కొనసాగింపునకు, లైసెన్సుల మంజూరుకు అనుమతిస్తూ అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ 2019 జూన్‌ 21న నిర్ణయం తీసుకున్నారు. 2019 అక్టోబరు ఒకటి నుంచి మద్యం దుకాణాలను ప్రభుత్వ దుకాణాలుగా నడిపేందుకు వీలుగా అవసరమైన మనుషులను గుర్తించాలని స్వయంగా జగనే ఆదేశాలు ఇచ్చారు. 2019 జులై 29న నాటి ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోనే లిక్కర్ బిజినెస్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దుకాణాల సంఖ్య, అవసరమైన చోట అద్దెకు తీసుకోవడం, ఆ దుకాణాలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, సిబ్బంది, రవాణా ఛార్జీలు తదితర అంశాలు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఖరారు చేశారు. ఆ సమావేశంలోనే బేవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా 3,500 రిటైల్‌ దుకాణాలు నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన జరిగింది. నాటి బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ 2019 జులై 30న నోట్‌ ఫైలు ప్రత్యేక ప్రధానకార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి సమర్పించగా అదే ఏడాది ఆగస్టు 16న నాటి సీఎం జగన్‌ ఆమోదం తెలియజేశారు.

A-2గా ఉన్న వాసుదేవరెడ్డిని బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీగా నియమించుకున్నారు. ప్రభుత్వంలోని కొందరు కీలక అధికారులు ఈ అంశాన్ని ప్రభావితం చేశారు. అప్పటి సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం వాసుదేవరెడ్డిని ఆంధ్రప్రదేశ్‌కు డిప్యుటేషన్‌పై తీసుకురావాలంటూ నాటి సీఎంకు ప్రతిపాదనలు పంపారు. రైల్వే మంత్రిత్వశాఖతో మాట్లాడాలని సూచించారు. స్క్రీనింగ్‌ కమిటీ వాసుదేవరెడ్డి నియామకానికి సిఫార్సు చేసింది. తగిన పోస్టులో నియమించాలని పేర్కొంది. ఆ నోట్‌ఫైల్‌ను అప్పటి సీఎం జగన్‌ ఆమోదించారు.

రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చిన వాసుదేవరెడ్డిని(A-2) బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీగా లేదా- తాగునీటి సరఫరా కార్పొరేషన్‌ ఎండీగానైనా నియమించాలంటూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సిసోదియా నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌ వి సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి జగన్‌లకు ఫైలు పంపారు. వాసుదేవరెడ్డిని రక్షిత నీటి సరఫరా కార్పొరేషన్‌ ఎండీగా నియమించాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌ వి సుబ్రహ్మణ్యం సిఫార్సు చేశారు. అప్పటికే ఉత్తర్వులు జారీ చేసేశామని నాటి ముఖ్యమంత్రి జగన్‌ ఒక నోట్‌ ద్వారా 2019 సెప్టెంబరు 16న తెలియజేశారు. బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీగా వాసుదేవరెడ్డిని నియమిస్తూ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఆయనను బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీగా డిప్యుటేషన్‌పై నియమిస్తూ 2019 సెప్టెంబరు 13న ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన సెప్టెంబరు 16న బాధ్యతలు తీసుకున్నారు. క్యాడర్‌ పోస్టులోకి ఆయనను ఎందుకు తీసుకున్నారో కారణాలు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ తర్వాత నాటి సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం సిఫార్సుల మేరకు ఆయను డిస్టలరీలు, బ్రేవరీస్‌ కమిషనర్‌గాను, బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీగాను నియమించారు. అనంతరం డి.సత్యప్రసాద్‌(A-3)ని బేవరేజస్‌ కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారిగా నియమించారు. అజేయకల్లం రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసి సిఫార్సు మేరకు ఈ నియామకం చేపట్టారు.

నాడు బేవరేజస్‌ కార్పొరేషన్‌లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నా..ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలూ తీసుకోలేదు. ప్రధానంగా మద్యం సరఫరా ఉత్తర్వుల విషయంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. కమిటీ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారమే ఈ ఉత్తర్వులు ఇవ్వాలని బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ ప్రత్యేకాధికారికి లేఖలు రాశారు. ఆ ఫైళ్లు ఏవీ ఎండీకి పంపకుండానే ప్రత్యేకాధికారి తన ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారు.ఈ అంశాలు ప్రస్తావిస్తూ నాడు ఎండీ రాసిన లేఖ ఎక్సైయిజ్‌ కమిషనర్‌కు వెళ్లినా ఆయన చర్యలూ తీసుకోలేదు. అవకతవకలు జరిగినట్లు 2020లోనే గుర్తించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని రికార్డులు తెలియజేస్తున్నాయి.

బేవరేజస్‌ కార్పొరేషన్‌లో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించినా వాసుదేవరెడ్డి (A-2), సత్యప్రసాద్‌ (A-3)లపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని నాటి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ధనుంజయరెడ్డి (A-31), కృష్ణమోహన్‌రెడ్డి (A-32) ఒత్తిడి చేసినట్లు నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్‌ భార్గవ్‌ సిట్‌ విచారణలో వెల్లడించారు. ఈ అక్రమాలపై ఎండీ వాసుదేవరెడ్డికి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్‌కు మెమోలు వరుసగా జారీ చేసినా వారు స్పందించలేదు. ఎలాంటి జవాబు ఇవ్వలేదని రజత్‌భార్గవ వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయాన్ని నాటి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయరెడ్డికి కూడా తెలియజేసినట్లు రజిత్‌ భార్గవ వెల్లడించారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లను వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇమ్మని కోరినా ఇవ్వకపోగా వారుచేసిన పనులను ర్యాటిఫై చేస్తూ పాత తేదీలతో ఉత్తర్వులు ఇవ్వాలని తనను ఒత్తిడి చేసినట్లు సిట్‌కు తెలియజేశారు.

ఇన్ని అక్రమాలు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు 2022 నాటికే తెలిసినా చర్యలూ తీసుకోలేదు. పైగా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు బేవరేజస్‌ కార్పొరేషన్‌ అక్రమాలపై ఎలాంటి మెమోలు ఇవ్వొద్దని ఆదేశించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కుంభకోణంలో వారు పూర్తి స్థాయిలో భాగస్వామ్యులయ్యారన్న విషయమూ తేలుతోంది

Tags: ap liquor scamap politicsIAS Dhanunjaya ReddyleonewsleotopSIT Reveals an Unexpected Twist in the AP Liquor Scamvakulabharanam krishnamohan
Previous Post

అమరావతిలో క్యాన్సర్ హాస్పిటల్‌..ఏపీ ప్రజలకు బాలయ్య బిగ్‌ రిలీఫ్‌..

Next Post

పులివెందులలో వార్‌ వన్‌ సైడ్‌.. జగన్‌ అభ్యర్ధికి డిపాజిట్‌ గల్లంతు..!

Related Posts

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

by లియో డెస్క్
September 10, 2026 5:11 pm

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చేపడుతున్న మెగా DSC ఉపాధ్యాయ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్న...

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

by లియో డెస్క్
September 9, 2026 7:21 pm

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ ఛైర్మన్‌...

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

by లియో డెస్క్
September 9, 2026 5:29 pm

రాజకీయ కక్షసాధింపు చర్యలు ఏ స్థాయికి దిగజారతాయో చెప్పడానికి మూడేళ్ల క్రితం జరిగిన...

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

by లియో డెస్క్
September 9, 2026 4:23 pm

ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్‌షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్...

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

by లియో డెస్క్
September 8, 2026 7:52 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనుల వేగం చూసి...

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

by లియో డెస్క్
September 8, 2026 6:04 pm

DSC నియామకాలపై సోషల్ మీడియా వేదికగా YCP, బ్లూ మీడియా కొద్ది రోజులుగా...

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

by లియో డెస్క్
September 8, 2026 4:58 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు తిరిగేసరికి, సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో...

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

by లియో డెస్క్
September 8, 2026 4:12 pm

  వైసీపీకి దూరమైన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటనతో రాష్ట్ర...

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

by లియో డెస్క్
September 7, 2026 10:40 pm

ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని...

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

కృష్ణ ‘గాజుల కిష్టయ్య’ సినిమాకి 45 ఏళ్ళు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

DSCపై వైసీపీకి దిమ్మతిరిగే కౌంటర్..లేడి సింగమ్స్ బ్యాగ్రౌండ్‌ ఇదే..!

పోలవరం LMC, వెలిగొండ పూర్తి..పీక్స్‌కి చంద్రబాబు గ్రాఫ్!

నన్ను కెలకొద్దు.. జగన్‌ కోటరీకి విజయసాయి వార్నింగ్..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist