తెలుగు తెరకి కొత్త అందాలను పరిచయం చేసిన నాయికగా హంసానందిని కనిపిస్తుంది. హంసా అందమంతా ఆమె వాలుకళ్లలో ఉంటుంది .. వయ్యారాల్లో ఉంటుంది. అందుకే మత్తెక్కించే పాత్రల్లో .. మనసును దోచే శృంగార పాత్రల్లో ఆమె ఎక్కువగా క్లిక్ అయింది. ఆమె చేసిన పాత్రలకంటే, ఐటమ్ నెంబర్లు ఎక్కువగా గుర్తింపు తీసుకొచ్చాయి. యూత్ లో ఆమెకి విపరీతమైన క్రేజ్ ను తెచ్చాయి. అలా హాట్ హాట్ గా కనిపించడం వలన వచ్చిన ఇమేజ్ నే ఆమెను ఇంతవరకూ నడిపిస్తూ వచ్చింది.

నిషా కళ్లు .. మంచి హైటూ హంసాలో ప్రత్యేకమైన ఆకర్షణ. ఆమె ఓరకంటితో చూసిందంటే ఓడిపోని మనసులు ఉండవు .. వాలు చూపు చూసిందంటే ఆమెకి దాసోహమనని హృదయాలు ఉండవు. అలాంటి హంసా ఈ మధ్య సోషల్ మీడియాలో తన దూకుడు పెంచింది. వాడివాడి చూపులతో వేడివేడిగా ఆమె వదులుతున్న ఫొటోలు చూసి కుర్రాళ్ల గుండెలు గూడ్సు రైళ్ల మాదిరిగా పరిగెడుతున్నాయి. ఆమె పరువాల పట్టాల మధ్య పడిపోతున్నాయి. తాజాగా బ్లాక్ స్విమ్ సూట్ లో ఉన్న తన ఫొటోను ఆమె షేర్ చేసింది. సొగసు బాణాలను గడుసుగా ఎక్కుపెట్టునట్టుగా కనిపించే ఆమెను చూస్తే, మన్మథుడు కోలుకోవడమే కష్టం .. ఇక మామూలు కుర్రాళ్ల పరిస్థితి వేరే చెప్పాలా?

హంసాను చూసిన వాళ్లంతా ఆమెకి దుస్తులపై పొదుపు ఉందిగానీ, అందాలపై అదుపు లేదనే అనుకుంటూ ఉంటారు. అందాలు ఎక్కువైపోయినప్పుడు పొంగిపోవడమో .. ఒలికిపోవడమో జరుగుతూనే ఉంటుంది కదా. అయితే ఈ సారి ఫొటోతో పాటే ఒక విషయాన్ని ఆమె చాలా స్ట్రాంగ్ గా చెప్పింది. “నేను ఏది చెప్పాలనుకున్నా సూటిగా చెబుతాను .. ఏది చెయ్యాలనుయకున్నా నేరుగా చేస్తాను. అభిప్రాయాలను .. ఆలోచనలను దాచుకుని ఇబ్బంది పడటం నాకు అలవాటు లేదు” అని చెప్పుకొచ్చింది. అంటే ఎవరేమనుకున్నా తనదారి తనదే అనేది ఇందులోని అంతరార్ధమన్న మాట.
Must Read ;- ఒకేరంగు లెహెంగాలో మెరిసిన అందాల గులాబీలు











