June 26, 2026 7:21 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

అలనాటి అతిలోక సుందరి .. బి.సరోజాదేవి (జన్మదిన ప్రత్యేకం)

అందం.. అభినయం కలగలిసిన నటి బి. సరోజాదేవి. అగ్రహీరోలందరితోనూ నటించారు. ఆ తరంలో అతిలోక సుందరి ఎవరంటే బి. సరోజాదేవి పేరే చెబుతారు. ఆ నటిపై ప్రత్యేక కథనం.

January 7, 2021 at 6:33 AM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

చారడేసి కళ్లతో .. కోరచూపులతో .. కొంటె నవ్వులతో .. ముద్దుముద్దు మాటలతో .. పడుచు హృదయాలపై పదనిసలు పలికించిన కథానాయిక బి.సరోజాదేవి. దారితప్పి వచ్చిన దేవకన్యలా .. గడపదాటి వచ్చిన గంధర్వ కన్యలా .. వనాలు విడిచి వచ్చిన వనకన్యలా తెలుగు తెరపై ఆమె చేసిన అందాల సందడి అంతా ఇంతా కాదు. అలనాటి కథానాయికలలో సావిత్రికి ఎదురుండేది కాదు. గ్లామర్ పరంగా జమున .. కృష్ణకుమారికి తిరుగుండేది కాదు. అలాంటి సమయంలోనే అందం .. అభినయం రెండూ కలగలిసిన నాయికగా బి.సరోజాదేవి ఎంట్రీ ఇచ్చారు.

కనురెప్పలను టపటపలాడిస్తూ తెరపై ఆమె చేసిన చూపుల విన్యాసాలు చూసి, అప్పటి కుర్రాళ్లు ఆమె అభిమానులుగా మారిపోయారు. ఆ కనురెప్పల మధ్య చిక్కుకుని నాజూకుగా నలిగిపోవాలని ఆశపడ్డారు. ఆనాటి స్టార్ హీరోయిన్స్ తెలుగు బాగానే మాట్లాడేవారు. అయితే బి. సరోజాదేవి కన్నడ నుంచి రావడం వలన తెలుగు అంతగా వచ్చేది కాదు. అయినా అలాగే మాట్లాడేసేవారు. అంతగా రాని తెలుగు ఒక యాసగా మారిపోయి అదో కొత్తదనమైపోయింది. అలా ముద్దుముద్దు మాటలతోనే ఆమె మరింతమంది అభిమానుల మనసులను మూటగట్టారు.

బి.సరోజాదేవి తండ్రికి నటన పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది. దాంతో ఆయన నాటకాలు ఆడుతూ ఉండేవారు. ఆ ప్రభావం ఆమెపై కూడా పడింది. 13 ఏళ్ల వయసులో ఆమె ఒక నాటకంలో నటిస్తూ ఉండగా కన్నడ దర్శక నిర్మాత ‘హొన్నప్ప భాగవతార్’ చూసి, ‘మహాకవి కాళిదాస’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా కన్నడ సినిమా ద్వారా నటిగా ఆమె కెరియర్ మొదలైంది. తెలుగులో ఆమె ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో శృంగార పురుషులను ఆకట్టుకునే ‘కళావతి’ పాత్రలో ఆమె మెప్పించారు.

50వ దశకం ద్వితీయార్ధంలోనే తన ఉనికిని చాటుకున్న సరోజాదేవి, 60వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. ఈ దశకంలో ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువ భాగం సూపర్ట్ హిట్లుగా నిలిచాయి. ఈ దశకంలో వచ్చిన ‘పెళ్లికానుక’ .. ‘జగదేకవీరుని కథ’ ..’ ఆత్మబలం’ .. ‘ శ్రీకృష్ణార్జున యుద్ధం’ .. ‘శకుంతల’ .. ‘అమరశిల్పి జక్కన్న’ వంటి సినిమాలు ఆమె కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచాయి. తనని తాను తీర్చిదిద్దుకుంటూ గ్లామర్ పరంగా కూడా ఆమె ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. థియేటర్ ను వదిలి ఇళ్లకు వెళ్లాలంటే బెంగపెట్టుకునేంతగా అభిమానులను ఆకట్టుకున్నారు.

‘జగదేకవీరుని కథ’ చూసినవారు, నిజంగానే ఆమె దేవకన్య ఏమో అనుకున్నారు. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’చూసినవారు ‘ సుభద్ర’ ఇలాగే ఉండేదేమోనని అనుకున్నారు. ‘శకుంతల’ చూసినవారు .. దుశ్యంతుడు ఉన్నపళంగా మనసు పారేసుకోవడంలో అర్థం ఉందనుకున్నారు. ‘అమరశిల్పి జక్కన్న’ చూసినవారు .. ఇంతటి సౌందర్య రాశిని అంత దగ్గరగా చూసినవాళ్లు కవులో .. శిల్పులో కావడంలో ఆశ్చర్యం ఏముందిలే అనుకున్నారు. ‘పెళ్లికానుక’ సినిమాలో ఆమె రెండు జడలు వేసుకుని సైకిల్ పై కాలేజ్ కి వెళుతుంటే, ఆ కాలేజ్ ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలామంది కుర్రాళ్లు ఉత్సాహపడ్డారు .. ఉబలాటపడ్డారు.

ఈ సినిమాలో ‘కన్నులలో పలకరించు వలపులు .. ‘ పాట చూస్తే, ఆమె కళ్లపైనే రాశారేమోనని అనిపించకమానదు. ఇక ‘ఆత్మబలం’ సినిమాలో ‘చిటపట చినుకులు .. ‘పాటలో తడుస్తూ కళ్లతో ఆమె వేసిన కోలాటాలు చూసి చాలామంది తమని తాము మరిచిపోయారు. ఇప్పటికీ ఆ పాట ఎక్కడైనా వినిపిస్తే మనసుకి ముసురుపట్టినట్టుగానే అనిపిస్తుంది. ఇలా తెరపై సరోజాదేవి సిగ్గుదొంతరలు పేరుస్తూ .. వయ్యారాలుపోతూ, ప్రేక్షకులను మురిపించారు .. మైమరపించారు. అప్పట్లోనే తన కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి, ఇతర హీరోయిన్లకు భిన్నంగా కనిపించడానికి ఆమె ప్రయత్నించారు .. సఫలీకృతులయ్యారు.

తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఆమె ఎన్నో సినిమాలు చేశారు. కన్నడలో అలనాటి స్టార్ హీరో అయిన రాజ్ కుమార్ తో ఆమె నటించారు. తమిళంలో ఎంజీఆర్ .. శివాజీ గణేశన్ .. జెమినీ గణేశన్ లతో ఆడిపాడారు. హిందీలో దిలీప్ కుమార్ .. సునీల్ దత్ .. రాజేంద్రకుమార్ జోడీగా మెప్పించారు. ఇక తెలుగులో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ సరసన అలరించారు. సాంఘిక .. జానపద .. పౌరాణిక చిత్రాల్లో నాయికగా తనదైన ముద్రవేశారు. ఇలా ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలలో నటించిన ఆమెను ఎన్నో బిరుదులు .. మరెన్నో అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ‘పద్మశ్రీ’ .. ‘పద్మభూషణ్’ పురస్కారాలు ఆమె కీర్తి కిరీటంలో నిలిచాయి.

తనలోని అందానికీ .. అభినయానికి పోటీ పెట్టేసి ఆ తమాషాని అల్లరి కళ్లతో వీక్షించే కథానాయికగా బి. సరోజాదేవిని గురించి చెప్పుకోవచ్చు. ఈ రెండింటిలో ఎక్కువ మార్కులు దేనికి ఇస్తారు? అనే ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే తెరపై ఆమె చేసే చూపుల మాయాజాలంలో చిక్కుకుని మార్కుల ఊసే మరిచిపోయే అవకాశాలు ఎక్కువ. తెలుగు కథానాయికలలో ‘అతిలోక సుందరి’ ఎవరంటే దాదాపుగా అందరూ శ్రీదేవి పేరే చెబుతారు. ఆమెకంటే ముందున్న తారల్లో ‘అతిలోక సుందరి’ ఎవరంటే మాత్రం ఎవరైనా సరే బి.సరోజాదేవి పేరు చెప్పాల్సిందే. ఈ రోజున ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆ నట పారిజాతానికి ‘ది లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

— పెద్దింటి గోపీకృష్ణ

Tags: actress sarojini devib. sarojadevisarojini devi birthday specialsenior actress sarojini devitelugu cinema updatestollywood newsveteran actress b. saroja devi
Previous Post

జగన్ సర్కారుపై సీబీఐ మాజీ డైరక్టర్ సంచలన వ్యాఖ్యలు

Next Post

ఓ వైపు ఆందోళ‌నలు, మ‌రోవైపు ఆకర్ష్.. బీజేపీ మరింత దూకుడు

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

శివ శివా… కాకినాడలో గుడి పూజారిపై ఎటాక్‌.. వైసీపీ నేతల అరాచకం..!!

శశికళ జైలు నుండి విడుదల

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist