ఏపీకి పురంధేశ్వరి, తెలంగాణకి కిషన్ రెడ్డి.. ఈ ఇద్దరిని ఎంచుకోవడంపై బీజేపీ పెద్దల లెక్కలు తప్పనే లెక్కలు వెలువడుతున్నాయి..
2024 లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రంలోని అధికార బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులు తీసుకుంది. దీంతో త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పార్టీకి కొత్త నేతలను నియమించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డిని, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ కేంద్రమంత్రి డి.పురంధేశ్వరిని నియమించింది.
అదేవిధంగా సునీల్ జాఖద్‌కు పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గానూ, బాబూలాల్ మరాండీకి జార్ఖండ్ చీఫ్‌గానూ బాధ్యతలు అప్పగించనున్నట్లు బీజేపీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఓబీసీ నేత ఈటెల రాజేందర్‌కు తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్‌పర్సన్ బాధ్యతలు అప్పగించారు. మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార భారతీయ రాష్ట్ర సమితిని ఎదుర్కొనేందుకు ఈ మార్పులు చేసినట్లు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్థానంలో కేంద్ర మాజీ మంత్రి డి.పురందేశ్వరి ఎంపికయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాగే, దీపక్ ప్రకాష్ స్థానంలో రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖద్‌కు పంజాబ్ బీజేపీ పగ్గాలు అప్పగించింది. అదేవిధంగా, జార్ఖండ్‌లో, గిరిజన నాయకుడు మరియు సీఎం హేమంత్ సోరెన్‌ను ఎదుర్కోవడానికి అదే సామాజికవర్గానికి చెందిన మాజీ సీఎం మరాండీని రంగంలోకి దింపింది. మరాండి తన జార్ఖండ్ వికాస్ మోర్చా ప్రజాతాంత్రికని 2020లో బీజేపీలో విలీనం చేశారు.
అయితే బీజేపీ తొందరపాటు నిర్ణయం తీసుకుందని సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి, బీజేపీ పెద్దలు తీసుకున్న నిర్ణయాల వాళ్ళ ఆ రాష్ట్రాలలో బీజేపీ కి పెద్ద దెబ్బె అని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులని మార్చే విధానములో, తీసుకునే నిర్ణయాలకు, అంచనా వేస్తున్న దానికి పొంతన లేకుండాపోయిందని, బీజేపీ పప్పులో కాలేసింది అని సమాచారం