నటనకు బాగా అవకాశం ఉన్న పాత్రలు పోషించాలని నటీనటులందరికీ ఉంటుంది. అయితే ఎప్పుడో ఒకసారి తప్ప అలాంటి పాత్రలు లభించవని ఆర్టిస్టులు పలు సందర్భాలలో అనడం వింటున్నదే. కొన్ని జాబ్ శాటిస్ఫాక్షన్, కొన్ని జేబు సాటిస్ఫాక్షన్ కోసం చేయక తప్పదని వారు బాహాటంగా చెబుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు కధలో అంతగా ప్రాధాన్యం లేని గ్లామర్ పాత్రలే వస్తుంటాయి. బాగా పేరు వచ్చేంతవరకు విధిలేక వాటిని చేసుకుంటూ పోతుంటారు.
అందాల భామ సమంత కూడా ఆ మధ్య వరకు గ్లామర్ పాత్రలే చేసుకుంటూ వచ్చింది. వాటిలోనే తన నటనను పలికించి ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఆమెకు కొంతకాలంగా తాను ఏదైతే ఆశిస్తూ వచ్చిందో ఆ తరహా పాత్రలే రావడం మొదలయ్యాయి. ఇక పెళ్లి తర్వాత కూడా పాత్రలను, సినిమాలను అంగీకరించడంతో ఆమె ఆచితూచి అడుగులు వేస్తోంది. యూ టర్న్, ఓ బేబీ చిత్రాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇదిలావుండగా.. ఇప్పడు ఆమె డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించింది.
ఇందులో భాగంగా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఆమె సన్నద్ధమవుతోంది. తన కెరీర్లోనే ఇంతవరకు చేయని వైవిధ్యమైన పాత్రలో ఆమె నటించబోవడమే ఓ ప్రత్యేకత ‘ది ఫ్యామిలీ మ్యాన్` మొదటి భాగం హిట్ కావడంతో ఇప్పుడు `ది ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్ రూపకల్పన జరుగుతోంది. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండో సిరీస్ లో సామ్ ఉగ్రవాదిగా కనిపించనుందట.
ఇక సామ్ కూడా ఇందులో నటించబోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తాను చేసే పాత్రలో చాలా కొత్తగా కనిపిస్తానని చెబుతోంది. సినిమాలలో మాదిరి ఇలానే నటించాలని కాకుండా రూల్స్ పక్కన పెట్టి మరీ నటించే అవకాశం ఓటీటీలో ఉంటుందని, దానిని తగిన రీతిలో తాను ఉపయోగించుకుంటానని సామ్ అంటోంది మరోవైపు ఆహా ఓటీటీ కోసం సామ్ జామ్ అనే షో కూడా సామ్ చేస్తోంది. ఇక తెలుగుతో పాటూ తమిళ చిత్రాలు కూడా చేస్తూ బిజీగా ఉంది.
Must Read ;- సమంతతో అయిపోయింది.. ఇక తమన్నా వంతు!











