ఓటీటీ రంగంలో భారీ పోటీ తప్పేలా లేదు. ఈ నవంబరు నుంచి రెండు కొత్త ఓటీటీ దిగ్గజాల మధ్య గట్టి పోటీయే నెలకొంది. స్మార్ట్ ఫోన్ ల రంగంలో యాపిల్ కు ఉన్న పేరు ఎలాంటిదో మనకు తెలిసిందే. దీన్నుంచి యాపిల్ టీవీ ప్లస్ పేరుతో ఓ స్ట్రీమింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. నెల సబ్ స్క్రిప్షన్ 99 కే అందుబాటులోకి తేవడంతో మిగతా పోటీ సంస్థలకు ఇది మింగుడు పడటం లేదు.
దాదాపు 100 దేశాల్లో యాపిల్ సంస్థ ఈ తరహా సేవలను ప్రారంభించిది. వీటిని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఒకేసారి మార్కెట్లో ఉన్న రెండు దిగ్గజ సంస్థలు స్ట్రీమింగ్ సర్వీస్ లోకి దిగడంతో పోటీ మరింత తీవ్రంగా మారింది. మరి వీటి దూకుడు ఇప్పటికే మార్కెట్లో ఉన్న అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి సంస్థలు ఎలా తట్టుకుంటాయో చూడాలి.
ప్రస్తుతం యాపిల్ టీవీ ప్లస్ చందా నెలకు రూ. 99మాత్రమే. దీనికి పోటీగా ఉన్న సంస్థల విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ రూ.129 గానూ, నెట్ ఫ్లిక్స్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ నెలకు రూ.199 గానూ, హాట్ స్టార్ రూ. 299గానూ నిర్ణయించారు. ధర విషయంలో యాపిల్ అందరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడింది. ఇక ఉచితం ఆఫర్లు కూడా ఉన్నయండోయ్.
కొత్తగా ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్, యాపిల్ టీవీ, ఐపోడ్ లాంటివి కొనేవారు ఏడాదిపాటు ఉచితంగా చూడొచ్చు. అంటే యాపిల్ 2019 ఈవెంట్ తర్వాత కొనేవారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందట. అంతకుముందు కొని ఉంటే మాత్రం ఆఫర్ వర్తించదు. ఇక ఎంతమంది చూడొచ్చుదానిపై కూడా స్పష్టత ఉంది. యాపిల్ టీవీ ప్లస్ చందా తీసుకుంటే ఫ్యామిలీ షేరింగ్ ఉంటుంది.
ఒకే అకౌంట్ తో ఆరుగురు లాగిన్ చేసుకోవచ్చు. మిగతా వాటిలో ఈ సదుపాయం పరిమితంగానే ఉంది. కంటెంట్ ముఖ్యంగానీ కటౌట్ కాదని యాపిల్ కు అర్థమైనట్టుంది. అందుకే కంటెంట్ కోసం భారీగానే ఖర్చుచేస్తోంది. ఇప్పటిదాకా ఆరు బిలియన్ డాలర్డు దాకా కంటెంట్ కోసమే యాపిల్ ఖర్చుచేసినట్టు సమాచారం. ఈ విషయంలో అమెజాన్ ప్రైమ్ ఏడు బిలియన్ డాలర్లు ఖర్చుచేసింది.
తమ దగ్గర ఎలాంటి కంటెంట్ ఉందో యాపిల్ ప్రకటించింది. ఎక్కువగా థ్రిల్లర్ కంటెంట్ కే ప్రాధాన్యం ఇచ్చింది. ఎక్కువ ఆదాయం యాప్ స్టోర్ నుంచి వస్తుంది కాబట్టి ఈ ఓటీటీ నుంచి భారీ లాభాలను కూడా యాపిల్ ఆశించడం లేదట. థ్రిల్లర్, కామెడీ షో కంటెంట్ మీద ఎక్కువగా దృష్టిపెట్టింది యాపిల్ సంస్థ. రానున్న కాలంలో ఈ ఓటీటీల హవా మరింత ఆసక్తిదాయకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ పోటీ నుంచి గట్టెక్కాలంటే సబ్ స్క్రిప్షన్ తగ్గించక తప్పదు.
Also Read ;- ఓహో అనిపిస్తోన్న తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్











