(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండల అభివృద్ధి కార్యాలయం ఆవరణంలోని స్వర్గీయ నందమూరి తారకరామారావు, కింజరాపు యర్రంనాయుడు విగ్రహాలను ధ్వంసం చేయడం పట్ల శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు సంతబొమ్మాళి మండల పోలీసు స్టేషన్లో స్థానిక టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దుండగులను తక్షణమే పట్టుకొని, కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
కేసు దర్యాప్తు : ఎస్ఐ
సంతబొమ్మాళి మండలాభివృద్ధి కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ దుశ్చర్యపై తెలుగుదేశం వర్గాలు ఫిర్యాదు చేశాయని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తంన్నామని సంతబొమ్మాళి ఎస్ఐ గోవిందరావు తెలిపారు.