ప్రజా సమస్యలు పట్టని సమీక్షలు ఎందుకు?
ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షలు నిర్వహించేది సమస్యలను పరిష్కరించేందుకే .. కానీ అవి ఎప్పుడూ పరిష్కారం కాకుంటే మరి సమీక్షలేందుకు అని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, ప్రజలు అనంతపురంలో ఆందోళనకు దిగారు. అనంత లో ఇటీవల కురిసిన భారీ వర్షాలపై మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాకు విచ్చేశారు. ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి తిరుగు ప్రయాణంలో ఆయన కాన్వాయిని అడ్డుకుని విద్యార్ధుల సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్ధులను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అలానే వరద మిగిల్చిన కష్టాలను కాలయాన చేయకుండా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరదల్లో నష్టపోయిన చివరి రైతు వరకు సాయం అందించాలని విద్యార్థులు గట్టిగా పట్టుపట్టారు. అయితే నిన్న శుక్రవారం జిల్లా కలెక్టర నాగలక్ష్మీ కూడా వరద బాధితుల నిరసన సెగ తలిగింది. ఇలా జగన్ రెడ్డి ప్రభుత్వం గుడ్డెద్దు పొకడలు మానుకోకుంటే మున్మందు భారీ మూల్యం చెల్లించక తప్పదు.
Must Read ;- జగన్ వ్యాపార అప్పుల కోసమే .. రాష్ట్రం అప్పులు పాలు!











