జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదు!
తమకు విద్యను దూరం చెయ్యేద్దని ఎయిడెడ్ లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు అవేదన వ్యక్తం చేస్తుంటే .. ఎయిడెడ్ ను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లొద్దని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నాశనం చేసే జీవోలు 42,50,51 లను తక్షణమే రద్దు చేయాలని పట్టుబడుతున్నాయి. ఈ అంశంపై గతంలో మావోయిస్ట్ పార్టీ కూడా ప్రభుత్వాన్ని హెచ్చిరించింది. అలానే ‘తెలుగుదేశం’పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీ ఎయిడెడ్ ను పూర్వం ఎలా కొనసాగించారో అలానే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి.
విద్యార్థుల భవితవ్యం బంగాళాఖాతంలో ..
రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థల స్థాపన, అందులో పేద, మధ్య తరగతి విద్యార్థుల మనుగడ ఈనాటిది కాదు. 1950 నుంచి 1980 వరకు ఎయిడెడ్ విద్యాలయాలు విద్యార్థుల పాలిట వరప్రదాయనిగా మారాయి. విశాఖ విసెస్ ఎవిఎస్ కళాశాల, విజయనగరం మహారాజ కళాశాల, భీమవరం డీఎన్ఆర్ కళాశాల, ఏలూరు సీఆర్.రెడ్డి కళాశాల, విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాల, సిద్ధార్థ కళాశాల, గుంటూరు ఎసి కళాశాల, హిందూ కళాశాల, కావలి జవహర్ భారతి వంటివి ఆనాటి నుంచి నేటి వరకు అన్ని వర్గాల విద్యార్థులను అక్కున చేర్చుకుని విద్యానందిస్తూ .. ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాయి. నోబెల్ బహుమతి గ్రహీత సి.వి రామన్, అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాథం, కే.రోశయ్య, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, జెడీ శీలం, బోత్స సత్యనారాయణ, బీవీ రాఘవులు వంటి ప్రముఖులు కూడా ఈ ఎయిడెడ్ లోని విద్యాన్యభసించి ఉన్నత స్థాయికి చేరారు. అటువంటి మహోన్నత చరిత్ర ఉన్న ఎయిడెడ్ ను శిథిలావస్థకు తీసుకెళ్లెందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
విద్యార్థుల జీవితాలతో చెలగాలా? ..
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఎయిడెడ్ నిర్లక్ష్యానికి గురైంది. గత పాలకులు కూడా ఎయిడెడ్ మనుగడుకు ఊతాన్ని ఇచ్చిందేమీ లేదు. అధ్యాపకుల పదవీ విరమణ ఫోస్టుల భర్తీ విషయంలోనూ, 3 వేల మంది అన్ – ఎయిడెడ్ అధ్యాపకులు ఎన్నో ఏళ్లుగా రూ.10 వేల జీతంతో పనిచేస్తూ ఎప్పటీకైనా పర్మనెంట్ అవుతాయని, టైంస్కేల్ పొందుతామని ఆశగా ఎదుచూస్తున్న వారు నేడు రోడ్డున పడ్డారు. ఏపీలో ఎయిడెడ్ కిందా 137 డిగ్రీ కళాశాలు ఉండగా .. అందులో 1 లక్ష 14 వేల మంది విద్యార్థులు, 124 జూనియర్ కళాశాలల్లో 60 వేల మంది విద్యార్థులు, ప్రాథమిక, ఉన్నత పాథశాలు 1,988 ఉండగా 2 లక్షల మంది విద్యార్థులు విద్యాను పొందుతున్నారు. మొత్తంగా జగన్ రెడ్డి విలీన నిర్ణయంతో అక్షరాల 3 లక్షల 74 వేల మంది విద్యార్థులు రోడ్డునపడ్డారు. ఉన్నఫలంగా అన్ – ఎయిడెడ్ గా విద్యాసంస్థలు మారితే ఇంత మంది విద్యార్థుల భవిష్యత్తు బంగాళాఖాతం కలిసిపోయినట్లే. ఫీజులు పెను భారమౌతాయి. కొన్ని కళాశాలు, పాఠశాలలు ఇప్పటికే విద్యార్థులకు టీసీలిచ్చి పంపుతున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ, కాకినాడ, నందిగామ, అనంతపురం,విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఎయిడెడ్ ముగిసిన అంకం!
నిజమే ఎయిడెడ్ ముగిసిన అంకంగా అభివర్ణించవచ్చు. ప్రస్తుత పరిస్థితి,ప్రభుత్వం మొండి వైఖరి చూస్తుంటే ఎయిడెడ్ భూస్థాపితానికి, శిథిలావస్థకు చేర్చే వరకు జగన్ రెడ్డి నిద్రపోయేలా కనిపించడం లేదు. ఎయిడెడ్ విలీనం నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నాం .. యథాతథంగా విద్యా సంస్థలను కొనసాగించవచ్చునని చెబుతునే ప్రభుత్వం తనపని తాను చేసుకుంటూ పోతుంది. ఎయిడెడ్ డిగ్రీ కళాశాల నుంచి తీసుకున్న అధ్యాపకులను తిరిగి యథా స్థానాలకు పంపకుండా, గురువారం జూనియర్ కళాశాల అధ్యాపకులను కూడా స్టాఫ్ కౌన్సిలింగ్ రావాలని ప్రభుత్వం ఆదేశించడం పట్ల విద్యార్థి సంఘాలు ఆక్రోసిస్తున్నాయి. మరో పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులను ఎక్కడిక్కడే అరెస్ట్ లు చేశారు పోలీసులు. తక్షణమే 42,50,51 జీవోలను రద్దు చేయాలని, ఎయిడెడ్ నుంచి తీసుకున్న అధ్యాపకులను తిరిగి పంపాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Must Read ;- ‘ఎయిడెడ్’ నిర్వీర్యంపై సమైఖ్య నిరసన!











