విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కావడానికి ప్రధాన కారణం సరైన మేనేజ్ మెంట్ లేకపోవడమేనని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. మైన్స్ లేకపోవడం అనేది కేవలం ఒక కారణం మాత్రమే.. అదే ప్రధాన కారణం కాదు. అవి లేకపోయినా సమర్థవంతంగా నడపగలిగే మేనేజ్ మెంట్ ఉంటే లాభాల బాట పడుతుంది. కేవలం మేనేజ్ మెంట్ నిర్లక్ష్యంగా వ్యహరించినందు వల్లే ఈ స్ధితి తలెత్తిందని సుజనా వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు కొన్ని హద్దులు ఉన్నాయి. ఈక్విటి రైజ్ చేయలేరు, ప్రభుత్వం మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుత టెక్నాలజీ కాలంలో కార్మికుల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు పట్ల.. రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ వహించిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు లేనందునే ప్రత్యేక ప్యాకేజీ సిద్దం చేశారు. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించి.. కేంద్రం నుంచి నిధులు రాబట్టే ప్రయత్నాలు చేయడం లేదన్నారు. మన సొంత ఇంటి పని ఎలా చేసుకుంటామో అంత శ్రద్ధ కనబరిస్తే తప్ప కేంద్రం నుంచి నిధులు రావు. కానీ, కనీసం వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం కూడా లేదన్నారు.
Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!











