Sundar Pichai Verses Bunny Vasu :
సోషల్ మీడియా వేదికగా పోస్ట్ అవుతున్న కథనాలు, వీడియోలే ఆధారంగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసుల మధ్య ఓ రేంజిలో వాగ్యుద్ధం జరిగినట్టుగానే చెప్పుకోవాలి. వాగ్యుద్ధం అయితే జరగలేదు గానీ.. ఒకవేళ వారిద్దరూ ముఖాముఖీగా ఎదురుపడి ఉంటే మాత్రం వాగ్యుద్ధం కంటే కూడా ఇంకా ఎక్కువే జరిగి ఉండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ కేంద్రంగా సాగిన ఈ రేకెత్తిన ఈ చర్చ.. ఇప్పుడు రచ్చరచ్చగా మారిపోయిందని చెప్పాలి. అయితే ఈ వ్యవహారంలో పిచాయ్, బన్నీ వాసులు ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని వాదులాడుకోలేదు గానీ.. అంతకంటే కూడా ఎక్కువే జరిగిందన్న రీతిలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఈ వ్యవహారం అసలు సంగతి ఏమిటి? సుందర్ పిచాయ్, బన్నీవాసులు తగవులాడుకోవడమేమిటి? అన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
పిచాయ్ స్పీచ్ పై బన్నీ వాసు గుర్రు
టాలీవుడ్ నిర్మాతగా ఉన్న బన్నీ వాసు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ తో ఓ రేంజి సంబంధాలు మెయింటైన్ చేసే బన్నీ వాసు.. తెలుగు చిత్రసీమలో ఓ ప్రముఖుడిగానే కొనసాగుతున్నారు. అయితే ఫ్యాన్స్ గొడవల్లో భాగంగా అప్పుడప్పుడు అటు ఫ్యాన్స్ ఇటు నెటిజన్లకు బన్నీ వాసు టార్గెట్ అవుతున్న వైనం మనకు తెలిసిందే. ఈ క్రమంలో తొలుత సోషల్ మీడియా మంచిదేనన్న అభిప్రాయంతో ఉన్న బన్నీ వాసు.. ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసుకున్నారు. సోషల్ మీడియా అంటేనే బెదిరింపులు, వేధింపులకు వేదికగా ఆయన ఓ అభిప్రాయానికి వచ్చారు. ఇలాంటి సమయంలోనే గూగుల్ సీఈఓ హోదాలో సుందర్ పిచాయ్ భావ ప్రకటనా స్వేచ్ఛ.. ప్రత్యేకించి ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఓ కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం గురించి తెలిసినంతనే పిచాయ్ పై బన్నీ వాసు అంతెత్తున ఎగిరిపడ్డారు. అసలు ఇంటర్నెట్ స్వేచ్ఛతో జనాలు ఏం చేస్తున్నారో పిచాయ్ కు తెలుసా? అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పిచాయ్ మాదిరే ఏదో నాలుగు మాటలు మాట్లాడి ఊరుకోవడానికి బదులుగా పిచాయ్ ప్రసంగాన్ని ప్రశ్నిస్తూ బన్నీ వాసు ఏకంగా ఆయనకు ఓ లేఖనే సంధించారు.
బన్నీ వాసు ప్రశ్నలకు ఆన్సరేమిస్తారో?
ఈ లేఖ బయటకు వచ్చినంతనే వైరల్ గా మారిపోయింది. పిచాయ్ తో బన్నీ వాసు నిజంగానే గొడవ పడినంతగా ఈ లేఖ పెద్ద కలరింగే ఇచ్చింది. అయినా ఈ లేఖలో బన్నీ వాసు ఏమంటారంటే.. తాను కూడా తొలి నాళ్లలో భావ ప్రకటన స్వేచ్ఛ, ఇంటర్నెట్ స్వేచ్ఛను చూసి సంబరపడ్డానని, అయితే గడచిన రెండేళ్ల నుంచి సోషల్ మీడియాలో వచ్చిన మార్పులతో తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు అయినా, ఇంటర్నెట్ స్వేచ్ఛకు అయినా బాధ్యత అంటూ ఉండాలని ఆయన పేర్కొన్నారు. బాధ్యత లేని భావ ప్రకటనా స్వేచ్ఛకు అయినా, ఇంటర్నెట్ స్వేచ్ఛ కారణంగా గడచిన రెండేళ్లుగా తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తున్నానని కూడా బన్నీ వాసు తనదైన శైలి అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ స్వేచ్ఛ కారణంగా తనలాంటి వారు ఎంతో మంది మానసికంగా కృంగిపోతున్నారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తన కూతురును చంపేస్తానని పోస్ట్ పెడితే.. దానిని తొలగించేందుకు తాను పడ్డ ఇబ్బంది వర్ణనాతీతం అని, సోషల్ మీడియా సంస్థలకు ఫిర్యాదు చేసిన ఫలితం కనిపించలేదని వాపోయారు. మనిషిని ఇంతతా కృంగదీసే ఇంటర్నెట్ కు ఇంత స్వేచ్ఛ అవసరమా? అంటూ ఆ లేఖలో ఆయన సుందర్ పిచాయ్ ని ప్రశ్నించారు. మరి బన్నీ వాసు లేఖకు సుందర్ పిచాయ్ ఏమని స్పందిస్తారో చూడాలి.











