గంగోత్రి సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. తనదైన స్టైల్ లో డ్యాన్సులతో.. ఎనర్జిటిక్ యాక్టింగ్ తో అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు ఏర్పరుచుకుని స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. ఆర్య, బన్నీ,హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య 2, వరుడు, వేదం, జులాయి, రేసుగుర్రం.. ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు. సక్సస్ సాధించాడు. అల.. వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్పతో తన స్థాయిని మరింతగా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నాడు.
పాన్ ఇండియా కాంపిటీషన్ లో ప్రభాస్ కి ధీటుగా ఎదిగేందుకు ప్రణాళికలు వేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్ వ్యూలో రచయిత బివిఎస్ రవి స్వయంగా అల్లు అర్జున్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాల్ని బయటపెట్టారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. అల్లు అర్జున్ బాగా కష్టపడి పని చేసే నటుడే కాదు.. ప్రతిసారీ యూనిక్ నెస్ కోసం ప్రయత్నిస్తారు. డ్యాన్సుల్లోనూ ప్రత్యేకత చూపిస్తారు. అదనపు హార్డ్ వర్క్ తో తన అన్ని చిత్రాలకు కొత్తగా ప్రయత్నిస్తాడు అన్నారు. ఇంకా ఏం చెప్పారంటే.. 2008లో వచ్చిన పరుగు సమయంలో బన్నీ చేసిన ప్రయత్నాలను చూసి ఆశ్చర్యపోయి తనను ఎగ్జయిటింగ్ గా ప్రశ్నించానని ఆయన తెలిపారు.
అల్లు అర్జున్ తన లక్ష్యాన్ని చేరుకునే వరకు తనకు తానుగా సంతృప్తి చెందడని తెలిపారు. పనిలో అతడు ఎప్పుడూ అలసిపోడని తెలియచేశాడు. అయితే.. ఓ రోజు అసలు మీ లక్ష్యం ఏమిటి? అని ప్రశ్నించగా.. నంబర్ వన్ హీరో కావాలని బన్నీ మనసులో మాట చెప్పారని బి.వి.ఎస్.రవి బయటపెట్టారు. చేసే పనిని అంకిత భావంతో చేయడం లక్ష్యం చేరుకునే వరకూ చంచలత్వం చూపించకపోవడమే బన్నీ విజయానికి కారణాలు అన్నారు. పుష్ప సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. బన్నీ నెంబర్ 1 హీరో అవ్వాలనే లక్ష్యాన్ని ఎప్పుడు చేరుకుంటాడో మరి..?
Must Read ;- అంధుడి పాత్రలో అల్లు అర్జున్.?











