సూపర్ స్టార్ మహేష్ బాబు – ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ‘సర్కారు వారి పాట’కు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్, వీడియోలు లీకవ్వడం.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరుగుతుంది.

దుబాయ్ లో గల ఎడారి ఎండలో ఫైట్స్ చేస్తున్నాడు మహేష్. ఛేజింగ్ జరుగుతోంది. మరోవైపు పై నుంచి హెలికాప్టర్లు దూసుకుపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇలా రకరకాల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడం చూస్తుంటే.. కావాలనే లీకు చేస్తున్నారా.? అనే అనుమానం కలుగుతుంది. కారణం ఏంటంటే.. స్టార్ హీరో సినిమాకి సంబంధించి ఏదైనా లీకయితే వెంటనే టీమ్ అలర్ట్ అవుతుంది.
లీకైన వాటినే వెంటనే సోషల్ మీడియాలో లేకుండా డిలేట్ చేస్తుంటుంది. డిజిటల్ టీమ్ అలాగే ఆ స్టార్ హీరో లీకు చేయద్దు అంటూ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తారు. టీమ్ ఇంకాస్త అలెర్ట్ అవుతుంది. ఎలాంటి స్టిల్స్ అండ్ వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది కానీ.. ‘సర్కారు వారి పాట’ సినిమాకి సంబంధించి స్టిల్స్ బయటకు వస్తుండడం చూస్తుంటే.. కావాలనే యూనిట్ మెంబర్సే ప్రమోషన్ లో భాగంగా లీకు చేస్తున్నారనిపిస్తుంది. ఈ భారీ చిత్రాన్ని 2022లో సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. మరి.. ఇకనైనా ఈ లీకులు ఆగుతాయో.. కొనసాగుతాయో చూడాలి.











