January 22, 2021 9:12 AM
21 °c
Hyderabad
23 ° Fri
23 ° Sat
23 ° Sun
24 ° Mon
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

సంపాదకీయం : ఆయన పార్టీ.. ఆయన ఇష్టం!

రజినీకాంత్ రాజకీయ పార్టీ అనే సినిమాకు స్క్రిప్టు వర్క్ జరిగింది. ముహూర్తం షాట్ తీయకుండానే.. గుమ్మడికాయ కొట్టేశారు.

December 30, 2020 at 9:07 AM
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘మక్కల్ సేవై కట్చి’ పేరుతో ప్రచారంలోకి వచ్చి రజినీకాంత్ పార్టీకి పురిట్లోనే సంధి కొట్టింది. వర్తమాన తమిళ రాజకీయాలకు సంబంధించి.. రజినీకాంత్ పార్టీ ఒక మృతశిశువు.

రెండు రోజుల్లో పార్టీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువరించడానికి ముహూర్తం పెట్టిన ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను పార్టీ ప్రారంభించలేనని చెప్పేశారు. రజినీకాంత్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి. తన చేతి సంజ్ఞలతో కొన్ని కోట్ల మందిని శాసించగల వ్యక్తిగా ఆయనకు పేరుంది. నిజానికి ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి.

ఆ శక్తి విశ్వరూపం ఏమిటో రాష్ట్ర ప్రజలకు, దేశానికి కూడా తెలియజెప్పడమే టార్గెట్ అన్నట్టుగా ఆయన రాజకీయ పార్టీ ఆలోచన చేశారు. నిజానికి రజినీ పార్టీ అనేది కొన్ని దశాబ్దాల నుంచి వినిపిస్తున్న మాట. ఊరించి ఊరించి.. ఆ పేరు మీద రాజకీయ యాంగిల్ చొప్పించిన అనేక సినిమాలను కమర్షియల్ విజయాలుగా కూడా మలచుకున్న తర్వాత.. రజినీ చివరి ముహూర్తం ప్రకటించి.. అప్పుడే కాడి పక్కన పడేశారు. ఆరోగ్య పరిస్థితులు, సమాజంలో కరోనా నేపథ్యం ఇత్యాది కారణాల దృష్ట్యా ఇప్పుడు తాను పార్టీ పెట్టలేనని, అభిమానులు ఇందుకు తనను క్షమించాలని తలైవా చెప్పారు. నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడతారని తెలుసు గానీ.. ప్రజలను ఇబ్బందులకు గురిచేయలేనని, 120 మందితో షూటింగులోనే కరోనా సమస్య ఉన్నప్పుడు, లక్షల మంది వచ్చే రాజకీయ సభలతో వారికి హాని చేయలేనని అందుకే పార్టీ ఆలోచన విరమించుకుంటున్నానని రజినీకాంత్ చెప్పారు.

పార్టీ పెట్టడమా? పెట్టకపోవడమా? అనేది పూర్తిగా రజినీకాంత్ సొంత వ్యవహారం. కాబట్టి ఈ విషయంలో నిందాస్తుతులకు అవకాశం లేదు. అలాంటి పనిచేయడం అత్యుత్సాహం, తప్పు అవుతుంది. అయితే అదే సమయంలో.. రాష్ట్ర ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకానికి ఆయన ఏ విధంగా జవాబు చెప్పబోతున్నారు. కేవలం క్షమాపణ సరిపోతుందా? వారు పెట్టుకున్న ఆశలను ఆయన ఏ విధంగా తీర్చబోతున్నారు. ఇవన్నీ కూడా చాలా కీలకమైన విషయాలు.

గతంలో ఓ సందర్భంలో జయలలితతో విభేదాలు వచ్చినప్పుడు.. అప్పటి ఎన్నికల్లో డీఎంకే కు ఓటు వేయాల్సిందిగా రజినీకాంత్ పిలుపు ఇచ్చారు. ఇప్పుడు ఆయనే రాజకీయాల్లోకి రావాలనుకుని- మానుకున్నారు. మరి.. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాజకీయంగా ఒక పార్టీకి మద్దతిచ్చేలా ఆయన ఏదైనా ప్రకటన చేస్తారా? అనేది ఒక ఆసక్తికరమైన అంశం. ఆయన స్వయంగా ప్రజలకోసం పార్టీ పెట్టలేని స్థితిలో ఉండొచ్చు. ఆయన పార్టీ పెట్టాల్సిందే అనే, డిమాండ్ చేసే హక్కు ఎవ్వరికీ లేదు. కాకపోతే.. ప్రజల్లో ఆశ రేకెత్తించిన సూపర్ స్టార్ గా .. ఆయన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ఉందని మాత్రం అనగలం. ఎందుకంటే.. ప్రజలకు మంచి జరగాలంటే.. ఎవ్వరి ద్వారా అది మెరుగ్గా సాధ్యమవుతుందో.. రజినీకాంత్.. కనీసం చెబితే.. ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల ఆయనకున్న శ్రద్ధకు నిదర్శనం అవుతుంది. తానుగా పార్టీ పెట్టలేని పరిస్థితుల్లో ఒక పార్టీని సమర్థించి, ఇతరులతో తానెందుకు వైరం కొని తెచ్చుకోవాలనే మధ్యస్త మార్గాన్ని రజినీకాంత్ అనుసరిస్తే గనుక.. ఖచ్చితంగా ఆయన ప్రజల ఆశలను వమ్ము చేసినట్లే.

Superstar Rajinikanth
Superstar Rajinikanth

దేవుడి హెచ్చరిక

రాజకీయ పార్టీకి సంబంధించి ఇటీవలి సమావేశం తర్వాత.. అన్నాత్త షూటింగ్ కు రజినీ హైదరాబాదు వచ్చారు. ఇక్కడ కరోనా పరీక్షలు చేయించుకుని, హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. హైబీపీ, బీపీలో హెచ్చుతగ్గులు ఆయనను ఆస్పత్రి పాల్జేశాయి. మూడురోజుల తర్వాత.. ఇంటికి వచ్చారు. రెండు రోజులు విరామం తీసుకున్నారు. ఈలోగా ఆయన కుమార్తెలు ఇద్దరూ.. అల్లుడు ధనుష్ వీరందరూ కూడా.. రాజకీయ పార్టీ ఆలోచన వద్దనే మాట చెబుతున్నట్లుగా బాగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే పార్టీ పెట్టడం లేదని అనేశారు.

అయితే బీపీ హెచ్చుతగ్గుల ద్వారా ఆస్పత్రి పాల్జేసిన, రాజకీయ పార్టీ విషయంలో పునరాలోచన కలిగించిన పరిణామాలను రజినీకాంత్.. దేవుడి హెచ్చరికగా అభివర్ణించడం చిత్రంగా ఉంది. రజినీ తిరుగులేని ఆధ్యాత్మ వాది. ఆ విషయం నిస్సంశయం. కాలినడకన, అత్యంత సాధారణ వ్యక్తిలాగా ఆయన హిమాలయాల్లోని తన గురువును దర్శించడానికి వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన ఆయనలో ఎక్కువ. అదే సమయంలో రాజకీయ పార్టీ ప్రకటన చేసినప్పుడు కూడా.. ఆధ్యాత్మకి రాజకీయాలను తీసుకువస్తానని ఆయన ఒక కొత్త మాట కూడా చెప్పారు. ఇదంతా రజినీలోని ఆధ్యాత్మకి జీవికి ప్రతీక.

అయితే పార్టీ పెట్టడం మానుకుని… దానిని దేవుడి హెచ్చరికగా అభివర్ణించడం ఏంటో అర్థం కావడం లేదు. రజినీకి మూత్ర పిండాల సమస్య ఉన్న సంగతి ఆయనకు ఇన్నాళ్లు తెలియదా? కొన్ని వారాల కిందట.. రజినీ పేరుతో పార్టీ పెట్టడం లేదనే ఒక లేఖ విడుదలైంది. అనంతరం ఆయన ప్రెస్ రిలీజ్ ఇస్తూ.. లేఖలోని అనారోగ్యం సంగతులు నిజమే గానీ.. లేఖ తను రాసింది కాదని వివరణ ఇచ్చారు. ఆయన అనారోగ్యం ఎప్పటినుంచో ఉంది. జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన బీపీ హెచ్చుతగ్గులు హఠాత్తుగా పార్టీ పెట్టవద్దనే దేవుడి హెచ్చరికగా ఆయన ఎలా భావిస్తున్నారు. పార్టీకే హెచ్చరిక అని ఎందుకు అనుకోవాలి. సినీ హీరోగా, అత్యంత క్లిష్టమైన పనిలో ఉండే సందర్భాలనుంచి కూడా దూరం ఉండాలనేందుకు దేవుడి హెచ్చరికగా ఎందుకు పరిగణించకూడదు. ఈ దేవుడి హెచ్చరిక సంకేతాలను.. సినిమా నటుడిగా జీవితానికి అన్వయింపజేసుకుని.. రజినీకాంత్ ఎందుకు సినీ రంగం నుంచి రటైర్మెంట్ ప్రకటించకూడదు. అన్నాత్త తన చివరి చిత్రం అని.. తర్వాత ఇక చేయనని ఎందుకు అనలేకపోతున్నారు.

ఇదంతా కమర్షియల్ యుగం. సంపాదన కోట్లలో ఉండే.. సినీ నటుడి ప్రస్థానాన్ని ఆయన వదులుకోలేరు. దేవుడు స్వయంగా వచ్చి హెచ్చరించినా సరే.. రజినీ దానిని వదులుకుంటారని అనుకోలేం. రజినీ- సూపర్ స్టార్ గా ఉండడం వలన వచ్చే ఆదాయం, లాభాలు ఇతర వ్యవహారాల మీద బతుకుతున్న వర్గాలు ఆయనను రిటైర్ కానివ్వవు. సినిమా నటుడిగా విరమించుకుంటే ఆయన కోట్లు కోల్పోతారు. అది ఇష్టం ఉండకపోవచ్చు. రాజకీయం అలా కాదు. ఆయన చేతినుంచి కూడా ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సేవగా భావిస్తూ ఖర్చు పెడితే.. ఆ పెట్టుబడి తిరిగొస్తుందో లేదో కూడా కష్టం.

ఇలాంటి నేపథ్యంలో బీపీ రూపంలో దేవుడు పంపిన హెచ్చరికల్ని.. కేవలం రాజకీయాలకు మాత్రమే పరిగణించాలని.. సినీ నట జీవితానికి ఆ హెచ్చరికలకు సంబంధం లేదని… రజినీకాంత్ భావించి ఉండవచ్చు. లేదా.. అలాంటి ఆలోచనలను.. ఆయన చుట్టూ ఉండే, ఆయనను ప్రభావితం చేయగల కోటరీ.. బలంగా ఆయన బుర్రలోకి ఎక్కించి ఉండవచ్చు.

ఏదైతేనేం.. ‘రజినీకాంత్- రాజకీయ పార్టీ’ అనే ట్యాగ్ లైన్ చుట్టూ పుకార్లకు ఊహాగానాలకు ఆశలకు నమ్మకాలకు శాశ్వతంగా తెరపడిపోయింది. ఆయనే స్వయంగా తెరదించి, శుభం కార్డు కాకుండా, ‘ది ఎండ్’ కార్డు వేసేశారు! రజినీకాంత్ ఒక వ్యక్తి కాదు శక్తి అని ముందు చెప్పుకున్నాం. ఆ మాట తప్పు. దాన్ని దిద్దుకోవాలి. రజినీకాంత్ ఒక శక్తి కాదు.. వ్యక్తి. ఆయన ఒక సినీనటుడు మాత్రమే. ఆ రంగంలో ఎన్నో ఉన్నతులను రుచిచూసిన సూపర్ స్టార్. అంతే. మహా అయితే.. నిస్సంశయమైన ఆధ్యాత్మిక చింతనశీలి. అంతే తప్ప ఆయన నాయకుడు కాదు. కాబోడు. పార్టీ అనేది ఆయన వ్యక్తిగత వ్యవహారం. ఆయన పార్టీ ఆయన ఇష్టం. అంతిమంగా ఈ పరిణామాలు తెలియజెబుతున్న సత్యం ఇది!

.. సురేష్ పిళ్లె
[email protected]

Tags: editorialmakkal sevai katchiNot Going To Launch Political Party: Rajinikanthrajinikanthrajinikanth latest newsrajinikanth new partysuresh pillaitalaivatamilnadu political newsసంపాదకీయం
Previous Post

ప్రభాస్ సరసన ‘ఫిదా’ బ్యూటీ… ఇది నిజమేనా.?

Next Post

నీ మదాన్ని అణిచేస్తాం జగన్ రెడ్డీ : లోకేష్

Related Posts

Editors Pick

వివాదాస్పద సాగు చట్టాల నిలిపివేతకు కేంద్రం అంగీకారం

by లియో రిపోర్టర్
January 22, 2021 8:58 am

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ నూతన చట్టాలను అవసరం...

Andhra Pradesh

విజయనగరం జిల్లా మన్యంలో మృత్యుఘోష .. అధికారులు అప్రమత్తం

by లియో డెస్క్
January 22, 2021 7:00 am

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం...

Andhra Pradesh

రామతీర్థం: టీడీపీ నాయకులకు 14రోజుల రిమాండ్

by లియో రిపోర్టర్
January 22, 2021 6:55 am

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం...

Editorial

పట్టాభిషేకానికి మనసా, కర్మేణా సిద్ధమవుతున్న కేటీఆర్!

by లియో రిపోర్టర్
January 21, 2021 8:23 pm

త్రికరణశుద్ధిగా అనే పదానికి మనసా వాచా కర్మేణా.. అనే అర్థం చెప్తారు పెద్దలు....

Andhra Pradesh

వీడని ‘స్థానిక’ చిక్కుముడి.. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంలో సవాల్

by లియో డెస్క్
January 21, 2021 7:45 pm

ప్రజారోగ్యం కాపాడుతూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం...

Andhra Pradesh

పూళ్ల గ్రామంలో వింత వ్యాధితో వ్యక్తి మృతి ?

by chamundi G
January 21, 2021 6:39 pm

వూళ్ల గ్రామంలో వింత వ్యాధితో పలువురు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గత...

Health

పొగరాయుళ్లంటే కొవిడ్‌కి కూడా భయమే!

by chamundi G
January 21, 2021 4:38 pm

Council of Scientific and Industrial Research (CSIR) చేపట్టిన దేశ వ్యాప్త...

Andhra Pradesh

సిట్ విచారణపై స్టే.. వాల్తేర్ క్లబ్ భూముల వశం కష్టమే?

by లియో డెస్క్
January 21, 2021 4:33 pm

 ( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)  నగర నడిబొడ్డున ఉన్న వాల్తేరు...

International

కమలా హారిస్ ‘పర్పుల్’ డ్రస్ వెనక ఇంత కథ ఉందా!

by chamundi G
January 21, 2021 3:22 pm

కమలా హారిస్.. అమెరికా చరిత్రలో తనకంటూ ఒక పేజీ లిఖించుకున్న భారతీయ-ఆఫ్రీకన్. అమెరికా...

General

పుణెలోని సీరంలో భారీ అగ్నిప్రమాదం

by లియో రిపోర్టర్
January 21, 2021 3:17 pm

పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 10 ఫైరింజన్లతో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కేసుల్లో పురోగతికి కేంద్రం జోక్యమే కారణమా?

కళా వెంకట్రావు అరెస్టు

నాగశౌర్యకు ‘పోలీసు వారి హెచ్చరిక..!’

విశాఖ వాల్తేరు క్లబ్ వివాదంపై ఏపీ హైకోర్టు స్టే

అన్యాయాన్ని ప్రశ్నించినవారిని అరెస్ట్ చేస్తారా ? : కళా

తిరుపతిలో టీడీపీ నేతల అరెస్ట్!

నిత్యం జ‌నంతోనే.. అంద‌రి దృష్టి కేతిరెడ్డిపైనే

కళా అరెస్టును ఖండిస్తున్నాం : అచ్చెన్న

దళిత యువకులను కట్టేసి కొట్టిన అగ్ర కులస్తులు..!

పొగరాయుళ్లంటే కొవిడ్‌కి కూడా భయమే!

ముఖ్య కథనాలు

‘సలార్’ కి విలన్ గా తమిళ క్రేజీ స్టార్ …?

వివాదంలో ‘బంగారు బుల్లోడు’

పట్టాభిషేకానికి మనసా, కర్మేణా సిద్ధమవుతున్న కేటీఆర్!

వీడని ‘స్థానిక’ చిక్కుముడి.. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంలో సవాల్

నాగశౌర్యకు ‘పోలీసు వారి హెచ్చరిక..!’

ఇప్పట్లో చిరూ ‘వేదాళం’ లేనట్టేనా?

విధి చేతిలో ఓడిపోయిన విజయం (సుశాంత్ సింగ్ జయంతి ప్రత్యేకం)   

సిట్ విచారణపై స్టే.. వాల్తేర్ క్లబ్ భూముల వశం కష్టమే?

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి బెదిరింపులు

ఈ రెండు క్రేజీ మూవీస్ టీజర్స్ అప్పుడే వస్తాయా?

సంపాదకుని ఎంపిక

కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?

నిధులు మొత్తం కరిగిపోయాయ్ : కార్పొరేషన్ అభ్యర్థులు దివాలా….!

మంత్రులకు మార్కులు ఇస్తున్న ఏపీ సీఎం జగన్

నా వల్ల కాదు : చేతులెత్తేసిన పవన్ నిర్మాత!

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ధిక్కారస్వరమే రాజన్నను దెబ్బతీసిందా.. ?

కాడిని వదిలేస్తున్న అగ్రనేతలు

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

రెండు ముక్కలైతే దక్కేదెంత? పోయేదెంత?

జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?

రాజకీయం

వివాదాస్పద సాగు చట్టాల నిలిపివేతకు కేంద్రం అంగీకారం

విజయనగరం జిల్లా మన్యంలో మృత్యుఘోష .. అధికారులు అప్రమత్తం

రామతీర్థం: టీడీపీ నాయకులకు 14రోజుల రిమాండ్

పట్టాభిషేకానికి మనసా, కర్మేణా సిద్ధమవుతున్న కేటీఆర్!

వీడని ‘స్థానిక’ చిక్కుముడి.. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంలో సవాల్

పూళ్ల గ్రామంలో వింత వ్యాధితో వ్యక్తి మృతి ?

భారత్‌పై విశ్వాసం.. బిడెన్‌కు సెనెట్ కమిటీ

సిట్ విచారణపై స్టే.. వాల్తేర్ క్లబ్ భూముల వశం కష్టమే?

కమలా హారిస్ ‘పర్పుల్’ డ్రస్ వెనక ఇంత కథ ఉందా!

కేటీఆర్ సీఎం?.. గ్రౌండ్ లెవెల్ కూడా ప్రిపేర్

సినిమా

‘సలార్’ కి విలన్ గా తమిళ క్రేజీ స్టార్ …?

వివాదంలో ‘బంగారు బుల్లోడు’

రష్మిక.. బాలీవుడ్ ఎంట్రీ ‘పుష్ప’ మూవీకి కలిసొస్తుందా.?

నాగశౌర్యకు ‘పోలీసు వారి హెచ్చరిక..!’

ఇప్పట్లో చిరూ ‘వేదాళం’ లేనట్టేనా?

విధి చేతిలో ఓడిపోయిన విజయం (సుశాంత్ సింగ్ జయంతి ప్రత్యేకం)   

నానీ హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న సూర్య

విక్టరీ వెంకటేశ్ కి ‘లక్కీ కీ’ దొరికిందా?

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి బెదిరింపులు

ఈ రెండు క్రేజీ మూవీస్ టీజర్స్ అప్పుడే వస్తాయా?

‘వకీల్ సాబ్’ కామిక్ బుక్.. సోషల్ మీడియాలో వైరల్

జనరల్

విజయనగరం జిల్లా మన్యంలో మృత్యుఘోష .. అధికారులు అప్రమత్తం

సిట్ విచారణపై స్టే.. వాల్తేర్ క్లబ్ భూముల వశం కష్టమే?

పుణెలోని సీరంలో భారీ అగ్నిప్రమాదం

ఇంటికే రేషన్ : వాహనాలను ప్రారంభించిన సీఎం

ఏబీవీకి మరో మూడు వారాల ఊరట

దుర్గగుడి వెండి సింహాల మాయం కేసులో కదలిక

ఎందుకీ అసమానతలు.. వాట్సప్‌కు కేంద్రం ఘాటు లేఖ

‘స్థానికం’పై ఉద్యోగుల‌ ఇంప్లీడ్ డిస్మిస్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా?

అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు పెడ్తారా..?

వేసవిలో సాగునీరు.. కేసీఆర్ ఆదేశాలు!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist