ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సభ మొదలవగానే జంగారెడ్డిగూడెం ఘటనపై చర్చకు పట్టుబడుతూ టీడీపీ సభ్యులు తమ ఆందోళనకు దిగారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం దగ్గర నిరసన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొన్న కల్తీ సారా మరణాలపై న్యాయ విచారణకు టీడీపీ పట్టుపట్టి, నిరసనగా అసెంబ్లీలో ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, తెలుగుదేశం నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
ఇక వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు.సభా కార్యక్రమాలకు తెలుగు దేశం నేతలు అడ్డుపడుతున్నారంటూ స్పీకర్ తమ్మినేని 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, గద్దె రామ్మెహన్, గొట్టిపాటి రవికుమార్, మంతెన రామరాజు, ఆదిరెడ్డి భవాని , అనగాని సత్యప్రసాద్, బెందాళం అశోక్ ,రామకృష్ణబాబు, గణబాబు, జోగేశ్వరరావు, సాంబశివరావులు సస్పెండ్ అయ్యారు.
Must Read:-ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!