రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు!
రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజవరపు అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. వచ్చె ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీనే ప్రభుత్వాన్ని ఫాం చేస్తుందని, 160 స్థానాల్లో గెలుపు ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఇంకా రెండెళ్ల సమయం ఉందలే అని నిద్రపోవద్దని.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను చూస్తే.. ఎన్నికలు ఎప్పడైనా రావచ్చునన్న సంకేతాలు కూడా లేకపోలేదని జోష్యం చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో సంచలనంగా మారిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ స్పీడ్ అందుకుంది. కోడి కత్తి, వివేకా హత్యను టీడీపీపై నెట్టి సానుభూతి ప్రచారం చేసుకుని, గద్దెనెక్కిన జగన్ కు ఈ రెండు ఊరితాళ్లు అయ్యాయని ఆరోపించారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలే అటు టీడీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి.
రైతు దగా ప్రభుత్వం..
వైసీపీ రైతు దగా ప్రభుత్వమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్ షాపులో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగుల నుంచి పేదల దాకా ప్రతి రంగాన్ని ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. టీడీపీ హయంలో రైతుల శ్రేయస్సుకు చేసిన దానిలో పావువంతు అయినా చేశారా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేలా ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. వ్యవసాయ మోటర్లుకు మీటర్లు పెట్టి.. రైతులకు ఊరితాళ్లును బిగించారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ హయంలో రైతు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయారని విమర్శించారు. కనీసం ఎరువులను కూడా పూర్తిస్థాయిలో అందించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.