తమిళంలో ఇప్పుడిప్పుడే పైకివస్తోన్న యంగ్ హీరో విష్ణువిశాల్. అతడి తండ్రిపై .. ప్రముఖ తమిళ హాస్యనటుడు సూరి చెన్నై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విష్ణు విశాల్ తండ్రి రమేశ్ కడవల్లా ఒక ప్లాట్ కు సంబంధించి తన దగ్గర దాదాపు రూ. 2కోట్లు తీసుకొని తనని మోసం చేశాడని సూరి పిర్యాదులో పేర్కొన్నాడు. తన డబ్బు తిరిగి ఇమ్మని వారిని ఎన్నిసార్లు అడిగినా.. ఐదేళ్ళ నుంచి వారి దగ్గరనుంచి సమాధానం లేదని సూరి తెలిపాడు.
రమేష్ తో పాటు ఫైనాన్సియర్ అంబువేల్ రాజన్ కు కూడా ఇందులో ప్రమేయం ఉందని , అంతేకాకుండా వీరధీర సూరన్ సినిమాకు గాను తనకివ్వల్సిన రూ. 40లక్షల పారితోషాకిన్ని కూడా ఎగ్గొట్టారని సూరి ఆరోపణ చేశాడు. సూరి పిర్యాదు మేరకు పోలీసులు రమేశ్ , అంబువేల్ రాజన్ పై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. కాగా రమేశ్ పోలీస్ అధికారిగా రిటైర్ అయ్యారు.
తన తండ్రిపై వచ్చిన ఫిర్యాదుపై హీరో విష్ణు విశాల్ స్పందించాడు. తమ కుటుంబంపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది షాకింగ్ గా ఉందని.. బాధ కలిగించేదిగా ఉందని ఆవేదన చెందాడు. తనపై, తన తండ్రి పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గతంలో ‘పారంబై’ సినిమా కోసం తమ దగ్గర అడ్వాన్స్ తీసుకొని తిరిగి సూరి ఇవ్వలేదని హీరో విష్ణు విశాల్ .. సూరిపై మండిపడుతున్నాడు.
ITS EASY TO ACCUSE OTHERS
HARDER TO CHECK ON YOURSELF
– BLESS#MOMENTOFTRUTH#உண்மைஒருநாள்வெல்லும் pic.twitter.com/nXaV7bLM9E— VISHNU VISHAL – VV (@TheVishnuVishal) October 9, 2020











