రైతుల పంట రుణాలు నవీకరణ పద్ధతిని సరళీకరించాలని డిమాండ్ చేస్తూ గురువారం అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు ముందు టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు, రైతులు బ్యాంకు ముందు బైఠాయించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బ్యాంకు అధికారులను టీడీపీ నేతలు, రైతులతో మాట్లాడించారు.సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని బ్యాంకు మేనేజర్ చెప్పడంతో త్వరలో రైతుల సమస్యలు పరిష్కరించకుంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించి ధర్నా విరమించారు. కార్యక్రమంలో రైతులు,టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
Must Read ;- ఒక్క రోజులో మారిన రైతు జాతకం.. రాయలసీమలో మొదలైన వజ్రాల వేట











