బోయిన్ పల్లి కిడ్నాప్ కేస్ కు సంబంధించి, తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను గురువారం రాత్రి చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు. ఆమె భర్త ఇంకా పరారీలోనే ఉన్నారు. అఖిలప్రియకు రిమాండ్ విధించిన అనంతరం అఖిల ప్రియ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆమె బెయిల్ పిటిషన్ పై శుక్రవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి. అఖిల ప్రియ ప్రస్తుతం గర్భవతి కావడంతో బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. అఖిలప్రియ ను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.
అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీ లో ఉన్నారు. భార్గవ్ రామ్ ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. A1 గా ఉన్న ఏవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ అనంతరం 41 సిఆర్పి నోటీసు ఇచ్చి వదిలేశారు. ఏ2 భూమా అఖిలప్రియకు మాత్రం రిమాండ్ విధించారు.
కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు ఇంకా అరెస్టు చూపించలేదు. హఫీజ్ పేట్ లోని భూ వివాదమే ఈ కిడ్నాప్ కు కారణమని పోలీసులు తేల్చిన సంగతి తెలిసింది.
Must Read ;- అప్పటి భూముల పంచాయితీ.. ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ కలిశారా?