నిన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా దొంగ ఓట్లు వేశారు. బస్సుల్లో, కార్లలో స్థానికేతరులను దింపి మరి ఓట్లు వేయించారు. ఈ వ్యవహరంపై ఇతర పార్టీలు భగ్గుమంటున్నాయి. నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ వైసీపీ తీరును ఎండగడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు యనమల వైఎస్ జగన్ పై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను దొంగ ఓట్లు, నోట్ల రాజ్యంగా మార్చారని ఆయన ఆరోపించారు. పోలింగ్ రోజు దొంగ ఓటర్లతో బస్సులు ఎలా తిరుపతికి వచ్చాయని ప్రశ్నించారు. నకిలీ ఓట్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. ఓటమి భయంతోనే జగన్ దొంగ ఓటర్లను దింపారని, తిరుపతి ఉప ఎన్నిక మళ్లీ నిర్వహించాలని యనమల అన్నారు.
Must Read ;- ప్రజాస్వామ్యం ఖూనీ : తిరుపతి ఉప ఎన్నికల్లో పోటెత్తిన దొంగఓటర్లు











