కరోనా బారిన పడ్డ జనసేన అధినేత పవన్ కల్యాణ్, తన వ్యవసాయ క్షేత్రంలో చికిత్స తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కరోనా బారి నుంచి పవన్ త్వరగా కోలుకోవాలని అభిమానుల్లో ఒక్కింత ఆందోళన నెలకొంది. పవన్ త్వరగా కోలుకోవాలని పూజలు కూడా చేస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ స్పందిస్తూ కోరోనా వైరస్ బారిన పడ్డ తాను ప్రస్తుతం కోలుకుంటున్నానని.. వీలైనంత త్వరగా కోలుకొని మీ ముందుకు వస్తానని తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. ఎప్పటికీ మీరంతా నా కుటుంబ సభ్యులే. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వచ్చి.. మీతోపాటే ప్రజల కోసం నిలబడతాను. ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్లు లేవని, రోగులకు సరైన మందులు అందుబాటులో లేవని, వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Must Read ;- పవన్ కోసం అభిమానుల ప్రత్యేక పూజలు : త్వరగా కోలువాలంటూ మొక్కులు











