మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా గని. ఇందులో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఎప్పుడో పూర్తయ్యింది. అయితే.. కరోనా కారణంగా ఇప్పటికే రెండు సార్లు విడుదల తేదీలను మార్చుకుంది. చివరకు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న గని చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే.. అదే డేట్ కి నాని శ్యామ్ సింగరాయ్, అక్కినేని నాగార్జున సమర్పిస్తున్న 83 సినిమాలు రిలీజ్ కానున్నాయి.
అలానే ఒక వారం ముందు అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ చిత్రం భారీ స్థాయిలో విడుదల అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాల మధ్య క్లాష్ ఇండస్ట్రీకి మంచిది కాదని భావించి గని సినిమాని రేసులో నుంచి తప్పిస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంతే కాకుండా.. వరుణ్ తేజ్ సినిమా ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేస్తామని.. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు.
ప్రేక్షకులకు అత్యుత్తమ విజువల్ ట్రీట్ ఇవ్వడానికి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించాం. పాండమిక్ నుంచి చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. క్లాష్ ని నివారించడానికి.. బిజినెస్ పరంగా ప్రతి ఒక్కరి పై ప్రభావం చూపుతుందనే విషయాన్ని గుర్తుంచుకొని మా చిత్రాన్ని వాయిదా వేయాలని మేము నిర్ణయించుకున్నాము అన్నారు. అలాగే గని చిత్రం ఖచ్చితంగా థియేటర్లోనే విడుదల అవుతుంది. ఈ సినిమా అందరికీ చిరస్మరణీయమైన అనుభవం అవుతుందని మేము నమ్ముతున్నాం. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తాం అని గని మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈవిధంగా వరుణ్ తేజ్ నానికి దారిచ్చేశారు.
Must Read ;- ‘పుష్ప’లో సమంత ఐటమ్ అంతా బూతేనట











