నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బొనిగి ఆనందయ్య ఆయుర్వేద మందుల పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఆనందయ్య ఆయుర్వేద మందులు కరోనా రాకుండా అడ్డుకోవడంతోపాటు,కోవిడ్ వచ్చిన వారికి కూడా తగ్గిస్తోందని బాగా ప్రచారం జరిగింది.దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు,తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా జనం పెద్ద ఎత్తున ఆయుర్వేద మందు కోసం తండోపతండాలుగా ఎగబడుతున్నారు.దీంతో వందలాది మంది క్యూలైన్లలో సామాజిక దూరం పాటించకుండా గంటల తరబడి నిలబడి ఆయుర్వేద మందు తీసుకెళుతున్నారు.దీనిపై జిల్లా అధికారులు ఆనందయ్య మందుల పంపిణీని నిలిపివేశారు.కరోనా మందుల పంపిణీ ప్రాంతంలో సామాజిక దూరం పాటించడం లేదని,కరోనా వ్యాపించే ప్రమాద ముందని మందుల పంపిణీని నిలిపివేశారు.దీంతో ప్రజల నుంచి, రాజకీయ నాయకుల నుంచి పెత్త ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేసింది. ఆనందయ్య మందులు పంపిణీ చేసుకోవచ్చు కానీ,సామాజిక దూరం పాటించేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆనందయ్య ఉచిత ఆయుర్వేద మందుల పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి.
తరతరాలుగా అందిస్తున్నారు
ఆనందయ్య తల్లి కూడా ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేసేవారు.ఆమె తరవాత ఆయన కుమారుడు ఆనందయ్య వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.చెన్నైలో ఉండే ఆయుర్వేద గురువు దగ్గర శిష్యరికం చేసిన ఆనందయ్య ఎప్పటి నుంచో ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేస్తున్నారు.కరోనా కోసం ఇప్పటికే 70 వేల మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ మందులపై ఏ ఒక్కరి నుంచి కూడా ఫిర్యాదు అందకపోవడం విశేషం. ఆనందయ్య ఆయుర్వేద మందుల పంపిణీ నిలిపివేయడంతో అనేక మంది రాజకీయ నేతలు కూడా స్పందించారు. హైదరాబాదులో చేప మందు,నెల్లూరు మూలాపేటలో దండ వేయడం,అల్లీపురంలో వేపాకు మండ వేయడంపై లేని అభ్యంతరం ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఎందుకని టీడీపీ నేత,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్నినిలదీశారు.వెంటనే ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. సీపీఐ నేత నారాయణ కూడ ప్రీగా ఇస్తున్న ఈ ఆయుర్వేద మందును అడ్డుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతించింది.
హాని లేని మందు
ఆనందయ్య ఆయుర్వేద మందులో ఎలాంటి రహస్యాలు లేవు.ప్రకృతిలో లభించే తిప్పతీగ,తాటిబెల్లం,పట్ట,తేనె, లవంగాలు,వేపాకు,మామిడి చిగురు,నేరేడు ఆకు,పిప్పింటాకు,బుడబుడసాకు,నేల ఉసిరి,కొండ పల్లేరు కాయలు, జాజికాయలను మాత్రమే వినియోగిస్తున్నారు.ఇవన్నీ ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగించేవే.దీంతో ఆనందయ్య ఆయుర్వేద మందుల పంపిణీని అడ్డుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు.అయితే కరోనా రోగులకు మాత్రం ఈ మందులు ఇవ్వొద్దని ఆదేశించారు.కరోనా రోగులు కూడా అక్కడ క్యూ కడితే కరోనా వ్యాపించే ప్రమాదం పొంచి ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
గ్రామస్థులు అండగా నిలిచారు
ఆనందయ్య ఆయుర్వేద మందుల తయారీకి గ్రామస్థులు అండగా నిలిచారు.30 మంది యువకులు నిరంతరం ఆయుర్వేద మందుల తయారీలో ఉచితంగా సేవ చేస్తున్నారు.కరోనాపై ప్రతిష్ఠాత్మక సంస్థలే రోజుకొక తీరుగా వైద్యాన్ని సూచిస్తున్న తరుణంలో ఆనంతయ్య ఆయుర్వేద మందులు కరోనా రోగుల పాలిట సంజీవనిలా మారాయని చెప్పవచ్చు.
Must Read ;- ఆనందయ్య కరోనా మందుపై ఐసీఎంఆర్ అధ్యయనం
https://www.youtube.com/watch?v=LGtAe5t2bAs










